బీజేపీతో చేతులు కలిపిన జనసేన.. పవన్ కీలక వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీతో చేతులు కలిపిన జనసేన.. పవన్ కీలక వ్యాఖ్యలు

January 16, 2020

b nnhbh

బీజేపీ –  జనసేన పార్టీలు కలిసి పని చేసేందుకు నిర్ణయించాయి. విజయవాడలో జరిగిన సమావేశంలో రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. రాష్ట్ర ప్రజల రక్షణ,భవిష్యత్తు కోసం బీజేపీతో చేతులు కలిపామని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వెల్లడించారు. సుదీర్ఘ చర్చల తర్వాత రెండు పార్టీల ముఖ్యనేతలు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. 

బీజేపీ – జనసేన పార్టీల భావజాలం ఒక్కటేనని పవన్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. 2024లో ఏపీలో బీజేపీ, జనసేనల ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.టీడీపీ, వైసీపీల ప్రభుత్వాలతో ప్రజలు విసిగి పోయారని అన్నారు. రాజధాని రైతులను నిండా ముంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ లాంటి బలమైన ప్రభుత్వం ఉండటం ఏపీకి అవసరమని చెప్పారు. రెండు పార్టీల మధ్య అవగాహన కోసం కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేస్తామని పవన్ వెల్లడించారు. ఏపీకి బీజేపీ అవసరం ఎంతగానో ఉందన్నారు. ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేస్తామని తెలిపారు.