ఇండస్ట్రీలో రెండు భిన్న ధృవాలు బాలయ్య, పవన్ కళ్యాణ్. నటన, సినిమాలు, రాజకీయాలు, వ్యక్తిగతం ఇలా ఎందులోనూ ఇద్దరికీ పొంతన ఉండదు. కానీ ఇద్దరు మంచి మిత్రులని ఇండస్ట్రీలో టాక్ ఉంటుంది. బయటపడరు కానీ ఒకరంటే ఒకరికి అభిమానం కూడా భారీగానే ఉంటుందని అంటారు. బద్రి, గబ్బర్ సింగ్ అంటే బాలయ్య తెగ లైక్ చేస్తాడట. ఇక సమరసింహారెడ్డి, శ్రీరామరాజ్యం చిత్రాలకు పవన్ వీరాభిమాని అట. ఇలా కనిపించని సైలెంట్ ఫ్రెండ్షిప్ కొనసాగించే పవన్,బాలయ్యలు షూటింగ్ సెట్ లో కలుసుకోవటం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతుంది. కైకాల సత్యనారాయణ పార్థివదేహాన్ని సందర్శించి అన్నపూర్ణ స్టూడియోలో తన హరి హర వీరమల్లు షూటింగ్ కి హాజరయ్యాడు పవన్ కళ్యాణ్. ఇక అదే అన్నపూర్ణలో బాలకృష్ణ వీరసింహారెడ్డి షూటింగ్ కూడా జరుగుతుంది.
దీంతో సినిమా సెట్ లో నందమూరి బాలకృష్ణని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలవగా.. ఆ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరసింహా రెడ్డి మూవీకి సంబంధించి లాస్ట్ సాంగ్ షూట్ తో పాటు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ షూటింగ్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లో పక్కపక్కనే జరుగుతోంది. ఈ క్రమంలో ఇద్దరి షూటింగ్ పక్కపక్కనే కాబట్టి.. వీరసింహారెడ్డి సెట్ కి వెళ్లిన పవన్ కళ్యాణ్.. బాలకృష్ణని కలిసారని సమాచారం. అయితే వీరిద్దరి చర్చల్లో ఇండస్ట్రీని షేక్ చేసే ఒకో అంశం చర్చకొచ్చిందట. బాలయ్య లేటెస్ట్ సెన్సేషన్ ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె.’ సీజన్ 2 ఆఖరి ఎపిసోడ్ కి హాజరవ్వాలని పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించాడని.. ఈ ఇంటర్వ్యూ గురించి చర్చ జరిగిందని.. త్రివిక్రమ్ తో షోకి కలిసొస్తే బావుంటుందని బాలయ్య పవన్ కి చెప్పినట్టు ఫిలిం నగర్ టాక్.