Pawan kalyan meets tdp leader nara Chandrababu naidu in Vijayawada
mictv telugu

చంద్రబాబుతో పవన్ భేటీ.. పొత్తు కోసమే!

October 18, 2022

వైసీపీ నాయకులకు చడామడా తిట్టేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ గంటల వ్యవధిలో మరింత కలకలం రేపారు. విజయవాడ నోవాటెల్ హోటల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. తనను విమర్శిస్తున్న వైసీపీ నేతలను ‘కొడకల్లారా చెప్పుతో కొడతా’ అంటూ ఘాటుగా తిట్టిన కాసేపటికే ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ అంటే తనకిష్టమేనని చెప్తున్నా ఆ పార్టీకి దూరంగా జరుగుతూ టీడీపీతో చేతులు కలుపుతున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో పొత్తు గురించి చర్చించడానికే కలుసుకున్నట్లు వార్తలే వస్తున్నాయి. తాను బాబుకు సంఘీభావం తెలపాడానికే వచ్చానని, రాజకీయ ముఖచిత్రం మారిపోతోందని పవన్ మీడియాతో అన్నారు.

పవన్‌తోపాటు ఆయన సోదరుడు నాగబాబు, జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ను చంద్రబాబు నాయుడిని కలుసుకున్నారు. భేటీలో ఏపీ రాజకీయాలపై, విశాఖలో మూడు రాజధానుల అంశంపై వైపీసీతో జరిగిన ఘర్షణపై చర్చించినట్లు తెలుస్తోంది. పవన్ సోమవారం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో భేటీ అయి, బీజేపీ సరైన రోడ్ మ్యాప్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఒక రోజు తిరక్కముందే పచ్చపార్టీ నేతను కలవడంతో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ . 2014 ఎన్నికల సమయంలోనూ పవన్, బాబు ఇలాగే కలుసుకుని పొత్తు ప్రకటించారు.