ఈ ఇద్దరు ఎవరో చెబితే గిఫ్ట్ ఇస్తా.. వర్మ  - MicTv.in - Telugu News
mictv telugu

ఈ ఇద్దరు ఎవరో చెబితే గిఫ్ట్ ఇస్తా.. వర్మ 

October 25, 2019

Woman made her lover as puppy 

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలకంటే తీస్తానని చెప్పే సినిమాల సంఖ్యే ఎక్కువ ఉంటుందని చెబుతారు. చాలా ప్రాజెక్టులను అటకెక్కించిన వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తర్వాత కాస్త దూకుడు పెంచాడు. ఆ చిత్రానికి సానుకూల స్పందన రావడంతో ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమా తీస్తున్నట్లు చెబుతున్నాడు. దీనికి సంబంధించి ఈ రోజు. పవన్ కల్యాణ్ కేరక్టర్‌ను ఉదయం ట్విటర్‌లో పరిచయం చేసిన కాసేటి కిందట నారా లోకేష్ పాత్రను పరిచయం చేశాడు. అందులో పవన్ కల్యాణ్ పాత్ర కూడా ఉంది. లోకేశ్, పవన్ ఏదో ముచ్చటించుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. 

 

అంతటితో ఆగకుండా ఆ ఫొటోలో ఉన్న ఇద్దరు ఎవరో చెబితే కానుక ఇస్తానని పుండుపై కారం రాశాడు ఆర్జీవీ. ఈ దీపావళి బాణసంచాను మరింత శబ్దమయం చేస్తున్నట్లుగా ఈ చిత్రం ట్రైలర్‌ను ఈ నెల 27న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మరోపక్క.. పవన్ కల్యాణ్ పాత్రను వర్మ కించపరుస్తున్నాడని ఆ హీరో అభిమానులు మండిపడుతున్నారు.