గంటసేపు నడిస్తే.. పాదయాత్ర? వాకింగ్? జాగింగ్? - MicTv.in - Telugu News
mictv telugu

గంటసేపు నడిస్తే.. పాదయాత్ర? వాకింగ్? జాగింగ్?

April 6, 2018

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను సాధించుకోవడానికి ఎవరికి తోచిన ఉద్యమాలు వారు చేస్తున్నారు. నిరసలు, ధర్నాలు, నిరాహారదీక్షలు, పాదయాత్రలు.. మరెన్నో నిర్వహిస్తూ తీరిక లేకుండా ఉన్నారు. జనసేన అధినేతి, నటుడు పవన్ కల్యాణ్ కూడా శుక్రవారం పాదయాత్ర చేశారు. కేంద్రప్రభుత్వ తీరును నిరసిస్తూ గంటపాటు నడిచారు. సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీల నేతలు ఆయన తోడుగా నడిచారు. బెంజి సర్కిల్ నుంచి జాతీయ రహదారి మీదుగా రామవరప్పాడు వరకూ యాత్ర సాగింది. సీపీఎం మధు, పీపీఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.అయితే తీవ్రమైన డిమాండ్ పై కేవలం ఒక్కటంటే ఒక్కగంట మాత్రమే పాదయాత్ర నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. పాదయాత్రను కనీసం ఒకరోజైనా నిర్వహించి ఉంటే బాగుండేదని అంటున్నారు. ‘గంటసేపు నడిస్తే పాదయాత్ర అనరు. వాకింగ్, జాగింగ్, షికారు కొట్టడం..  మరేదో అంటారు. పవన్‌కు నిజాయితీ ఉంటే అలా చేసిండేవారు కాదు. ఎండలో నడవడం ఆయనకు చేతకాదు. అంతగా అయితే పొద్దునో, రాత్రో యాత్ర చేయాల్సింది.. ’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే.. చెమట పట్టిన పవన్ ఫొటోలను చూస్తుంటే బ్రోతల్ హౌస్ పై పోలీసుల దాడిలో పట్టుబడిన విటుడి ఫొటోల్లా ఉన్నాయని తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎండలో నడిస్తే గ్లామర్ దెబ్బతింటుందని, అందుకే ఆయన తూతూమంత్రంగా గంటసేపే నడిచారని వైకాపా, టీడీపీ తదితర పార్టీల అభిమానులు విమర్శిస్తున్నారు.

కాగా, సీపీఎం నేత మధు చొక్కాను పవన్ తన చేతిపై వేసుకున నడవడం ఆసక్తికరంగా మారింది. చెమటలు పట్టడంతో మధు తన చొక్కాను తీసేసి బనియన్‌తోనే నడిచారు. ఆ చొక్కాను పవన్ తన చేతిపై వేసుకున్నాడు.