పవన్ కల్యాణ్, సన్నీలియోని సుఖపెట్టారు.. - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ కల్యాణ్, సన్నీలియోని సుఖపెట్టారు..

November 21, 2017

సంచలన సినిమాలతోనే కాకుండా  సంచలన వ్యాఖ్యలతోనూ రోజూ వార్తలకెక్కే రాంగోపాల్ వర్మ ఈసారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసుకున్నారు. జనసేన పార్టీనీ లక్ష్యం చేసుకుని ఫేస్ బుక్‌లో ఘాటు సటైర్లు వేశాడు.

‘‘సన్నీలియోన్‌కి పవన్‌ కళ్యాణ్‌ కన్నాఎక్కువ జన సమూహం అవుతున్నారంటే ఎవరిని పుట్టించిన ఏ అమ్మలో ఏ బిడ్డ తప్పుందో ఏ అమ్మకి కూడా తెలియదని ప్రతి నాన్నకు తెలుసు’ అని  ఆర్జీవీ వివాదాస్పద పోస్ట్‌ చేశారు. పోర్న్ స్టార్ సన్నీలియోని కొచ్చి పర్యటనకు వెళ్లినప్పుడు జనం తండోపతండాలుగా వచ్చిన ఫొటోను కూడా జత చేశాడు.పవన్ పార్టీ జనసేనపై స్పందిస్తూ.. ‘పవన్‌, సన్నీలియోనితో కలిసి కలిసి జనసేన/జనసేవ పేరుతో రాజకీయ కూటమి ఏర్పాటు చేస్తే అసాధారణ రాజకీయ శక్తిగా మారుతారన్న ప్రగాఢ నమ్మకం నాకుంది. ఎందుకంటే ఇద్దరు వేరు వేరు విధాలుగా ప్రజలకి వేరువేరు వినోదాత్మక సుఖాలు ఇచ్చారు’ అని పోస్ట్ పెట్టాడు.

పవన్ కల్యాణ్‌కు  ఉన్న లక్షలాది అభిమానులు పవన్ కు, సన్నీలియోల్లో ఒకరికే హగ్ ఇచ్చే చాన్స్ వస్తే ఎవరిని హగ్ చేసుకుంటారన్నది పవన్‌ అభిమానిగా పవన్‌ లక్షల అభిమానులకు నా ప్రశ్న..’ అని మరో పోస్టు పెట్టాడు.

వర్మ పోస్టులపై పవన్ అభిమానులు ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. సినిమాలు తీసుకోకుండా ఎప్పుడూ ఫేస్ బుక్ తెరిచి మందు మత్తులో ఏదో ఒకటి వాగడం తప్ప ఆయన చేసిందేమీ లేదని అంటున్నాడు. ఎప్పుడూ తమ హీరోను ఆడిపోసుకోవడం తప్ప నీకేం పనిలేదా అని తిడుతున్నారు.