పవన్ కల్యాణ్‌పై వర్మ బంపర్ కామెడీ - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ కల్యాణ్‌పై వర్మ బంపర్ కామెడీ

October 28, 2017

పవర్ స్టార్ పవన్, జనసేన అధినేత కల్యాణ్ పై దర్శకుడు రాంగోపాల్ వర్మ ఘాటైన విమర్శలు సంధించాడు. భయంకరమైన కామెడీ గుప్పించి తయారు చేసిన వీడియోను కూడా ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు. రాష్ట్ర విభజన సమయంలో తాను ఆవేదనతో 11 రోజులు అన్నం తినడం మానేశానని పవన్ కల్యాణ్ ఓ సభలో చెప్పిన మాటలు, దాని విన్నవారి హావభావాలు ఈ వీడియోలో ఉన్నాయి. పవన్ చాలా భావోద్వేగంతో మాట్లాడి, అబద్ధం చెప్పాడని వర్మ వ్యంగ్యాస్త్రం సంధించాడు. సత్యాన్ని భ్రష్టుపట్టించిన పవన్ మాటలు విన్నవారి స్పందనలు ఇవీ అని పేర్కొన్నాడు. వివిధ సినిమాలోని క్లిప్పింగులు జోడించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 11 రోజులు అన్నం తినలేదు.. అని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిన మాటను పదేపదే వినిపిస్తూ.. ఆ మాటలకు ఘాటు రియాన్షన్లను జోడించారు వీడియోలో. పవన్ తీరును వర్మ ఇటీవల తీవ్రంగా విమర్శిస్తుండడం తెలిసిందే. విజయ్ దేవరకొండ పవన్ కంటే 10 రెట్లు మంచి నటుడని అన్నారు.