పవన్ టూర్‌లో జేబు దొంగల చేతి వాటం - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ టూర్‌లో జేబు దొంగల చేతి వాటం

December 2, 2019

సందట్లో సడేమియా అన్నట్టుగా పవన్ పర్యటనలో జేబు దొంగలు మత చేతివాటాన్ని ప్రదర్శించారు. కార్యకర్తలు  అంతా తమ అధినేతను కలిసేందుకు పోటీ పడుతుండగా జేబుల్లో ఉన్న పర్సులు, సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లారు. జనసేనాని రాయలసీమ పర్యటనలో భాగంగా రేణిగుంటలో ఆయనకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సమయంలో కేటుగాళ్లు తమ కత్తెర్లకు పని చెప్పి వాటిని ఎత్తుకెళ్లారు. 

Pawan Kalyan.

పవన్ వచ్చిన వెంటనే కార్యకర్తలు, అభిమానులు అంతా ఆయన్ను కలిసేందుకు ఒకరిపై ఒకరు పడ్డారు. తోపులాట జరగడంతో అదే అదునుగా భావించిన దొంగలు  జేబులు కొట్టడం ప్రారంభించారు. దీంతో దాదాపు 30 నుంచి 45 మంది వరకు తమ జేబులో ఉన్న నగదు, వస్తువులు గల్లంతైనట్టు గుర్తించి లబోదిబోమన్నారు. అంతా కలిసి రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సమయాల్లో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.