అదరగొట్టిన పవన్ కల్యాణ్.. ప్రీ షూట్ వీడియో విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

అదరగొట్టిన పవన్ కల్యాణ్.. ప్రీ షూట్ వీడియో విడుదల

April 9, 2022

యంయయ

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై తాజాగా చిత్రీకరించిన ప్రీ షూట్ సెషన్ వీడియోను శనివారం ‘హరిహర వీరమల్లు’ చిత్రబృందం విడుదల చేసింది. విడుదల చేసిన వీడియోలో.. పవన్ కల్యాణ్ ఓ పోరాట యోధుడు ప్రదర్శించిన పరాక్రమం, నైపుణ్యాలను అదరగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో పవన్ అభిమానులను ఆనందంలో ముంచెస్తోంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరుగాయి. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నారు. 17వ శతాబ్దం నాటి కథతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ నేపథ్యంంలో సినిమాకు సంబంధించి హైదరాబాదులో భారీ సెట్టింగుల మధ్య పవన్ కల్యాణ్‌పై గతకొన్నిరోజులుగా పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆయా సన్నివేశాలకు ముందు పవన్ ఏ విధంగా సాధన చేశారన్నది ఈ ప్రీ షూట్ వీడియోలో చూపించారు. ఈ వీడియోలో అక్రమార్కులకు వ్యతిరేకంగా ఓ పోరాట యోధుడు ప్రదర్శించిన పరాక్రమం, నైపుణ్యాలను చూడొచ్చని దర్శకుడు క్రిష్ పేర్కొన్నారు. ఏఎం రత్నం సమర్పణలో ఏ.దయాకర్ రావు నిర్మాతగా మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.