రిజర్వేషన్లపై పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

రిజర్వేషన్లపై పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు

November 18, 2017

ఓ అవార్డు తీసుకోవడానికి లండన్ వెళ్లిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారతదేశంలో రిజర్వేషన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు ఇంకా కొనసాగుతున్నాయని, వాటి అవసరం లేదని అన్నట్లు మాట్లాడారు. ఆయన లండన్‌లో తెలుగు విద్యార్థులతో ముచ్చటించారు.

రాజ్యాంగం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని, అవి అవసరం లేని రోజు రావాలని చెప్పారు. తమది వెనుక బడిన కులం అని చెప్పుకోవడానికి ఇదివరకు ఇబ్బందిపడేవారని, కానీ ఇప్పుడు గర్వపడుతున్నారని అన్నారు. కాగా, ఏదైనా అనుకున్న వెంటనే సాధ్యం కాదని, దానికి సహనం కావలని చెప్పారు. సినిమాలు వేరు, నిజ జీవతం వేరు అని పేర్కొన్నారు. భారతదేశంలో భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకుంటున్నారన్న అంశంపై స్పందిస్తూ.. స్వేచ్ఛ ముసుగులో ఇష్టం వ‌చ్చిన‌ట్లు ప్ర‌వ‌ర్తించ‌ కూడదని అన్నారు.