తెలంగాణ బంద్‌కు పవన్ మద్దతు... - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ బంద్‌కు పవన్ మద్దతు…

October 14, 2019

తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్‌ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్‌ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యపై పవన్ ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. డ్రైవర్‌ శ్రీనివాస్‌ రెడ్డి ఆత్మహత్య అత్యంత దురదృష్టకరం అని అన్నారు. కోరుకున్న తెలంగాణ వచ్చాక కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం అని వాపోయారు. సమ్మెను తెలంగాణ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులలో ధైర్యం నింపేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులను తెలంగాణ ప్రభుత్వం చర్చలకు పిలవాలని పవన్‌ సూచించారు. 48 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పడం ఉద్యోగవర్గాల్లోనే కాదు సాధారణ ప్రజల్లో కూడ తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.

 

48 వేల మందిని ఉద్యోగాల నుండి తొలగిస్తామని చెప్పడం ఉద్యోగవర్గాల్లోనే కాదు సాధారణ ప్రజల్లో కూడ తీవ్ర …

Read more at: https://telugu.asianetnews.com/telangana/pawan-kalyan-supports-to-telangana-bandh-over-rtc-strike-pzcsx8ఈ నెల 19న తెలంగాణ ఆర్టీసీ ఐకాస తలపెట్టిన రాష్ట్రబంద్‌కు జనసేన మద్దతు ఇస్తున్నట్టు పనన్ తెలిపారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నెలకొన్న పరిణామాలతో ఖమ్మం జిల్లాకి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్యహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. అక్టోబర్ 12న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. 90 శాతానికి పైగా శరీరం కాలిపోయింది. వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ అక్టోబర్ 13న మృతి చెందారు. ఇది మరువక ముందే హైదరాబాద్ రాణిగంజ్‌కు చెందిన మరో ఆర్టీసీ కండక్టర్ నరేందర్ గౌడ్ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వ మొండి వైఖరితోనే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికులను ప్రతిపక్షాలు, యూనియన్ నాయకులు రెచ్చగొడుతున్నారని చెబుతోంది.