తెలంగాణలో పోటీకి జనసేన రెడీ.. పవన్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో పోటీకి జనసేన రెడీ.. పవన్

March 16, 2019

సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేసేందుకు జనసేన పార్టీ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఓవైపు ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థలను ప్రకటిస్తూ.. తెలంగాణలోనూ అభ్యర్థులను పోటీకి దించాలని నిర్ణయించారు పార్టీ నేతలు.. ఇందుకోసం తెలంగాణలోని పార్లమెంట్ స్థానాలకు దరఖాస్తుల స్వీకరించేందుకు ప్రాణాళికలు రూపొందిస్తున్నారు.శంకర్ గౌడ్, అర్హంఖానత్‌లతో కమిటీ వేసి, మూడు రోజుల పాటు విజయవాడ, హైదరాబాద్‌లోని మదాపూర్ పార్టీ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Pawan Kalyan s Jana Sena Party Ready To Parliamentary Elections In Telangana.

జనసేన అధినేత పవన్ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేయాలని భావించారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. దీంతో అప్పుడు తమ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అందుకు తాము సిద్ధంగా లేమని పవన్ ప్రకటించారు. అప్పుడు పోటీ చేయమని చెప్పిన పవన్.. ఇప్పుడు పక్కా ప్లాన్‌తో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేస్తామని ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. ఈ మేరకు బీఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా పవన్ సమావేశమైన విషయం తెలిసిందే.