తెలుగు, తమిళ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సముద్రఖని. అలవైకుంఠపురం, ఆర్ఆర్ఆర్ తాజాగా ‘సర్కారు వారి పాట’లో ప్రముఖ పారిశ్రామిక వేత్త పాత్రలో మహేష్ బాబుతో పోటీ పడి నటించిన ఈ వెర్సటైల్ యాక్టర్… ఓ ఇంటర్వ్యూలో పవన్‌తో రీమేక్ చేస్తున్నట్టు వెల్లడించారు. తాను పవన్ కల్యాణ్ అభిమానినని, తనలాంటి వారందరినీ దృష్టిలో పెట్టుకుని సినిమాను తెరకెక్కించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం సంబంధిత పనులు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిపారు.
తాను హీరోగా నటించిన తమిళంలో హిట్టైన ‘వినోదయ సిత్రం’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నట్టు చెప్పుకొచ్చారు. ఫాంటసీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో తంబి రామయ్య, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు రీమేక్‌లో మార్పులు చేయనున్నారని సమాచారం.తెలుగు వెర్షన్లో పవన్ కళ్యాణ్‌ను హీరోగా చూపిస్తానన్నారు సముద్రఖని. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో అభిమానమని, ఒక ఫ్యాన్‌గా ఆయన్ని ఎలా చూపిస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారనే విషయంలో తనకు క్లారిటీ ఉందన్నారు. ఈ సినిమాలో పవన్‌తోపాటు సాయి ధరమ్‌తేజ్ ఈ సినిమాలో నటించే అవకాశాలున్నాయని సమాచారం. సముద్రఖని ఇంతకుముందు తెలుగు హీరోలతో ‘శంభో శివ శంభో’, ‘జెండా పై కపిరాజు’ తదితర చిత్రాలు తెరకెక్కించారు.