..అప్పటివరకు కొబ్బరి నీళ్లు తాగను.. పవన్ శపథం  - MicTv.in - Telugu News
mictv telugu

..అప్పటివరకు కొబ్బరి నీళ్లు తాగను.. పవన్ శపథం 

December 8, 2019

Pawan kalyan022

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తన పర్యటనలకు భయపడుతోందని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన  రోజు వెలగతోడులో రైతులతో మాట్లాడి, వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఏపీ ప్రభుత్వం రైతుల సమస్యలను గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. 

‘నాయకులు ఓట్ల కోసం పాదయాత్రలు చేస్తున్నారు. మనకు కావాల్సింది రైతుల కన్నీళ్లు తుడిచే పాదయాత్రలు. జగన్ ఇప్పుడు ప్రజల్లో తిరగాలి. వైకాపా ఎమ్మెల్యేలు రైతుల కన్నీటితో కూడిన రక్తం కూడు తింటున్నారు..’ అని తీవ్రంగా విమర్శించారు. రైతుల సమస్యలను చాలా సునిశితంగా విశ్లేషించారని, వాటి పరిష్కారం కోసం ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. తమ పార్టీ ఉద్యమిస్తోందని తెలిసే ప్రభుత్వం రాత్రికి రాత్రి ధాన్యం కొనుగోళ్ల కోసం రూ. 87 కోట్లను విడుదల చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. 

పవన్ ప్రసంగం సందర్భంగా ఓ రైతు ఆయనకు తాగమని కొబ్బరిబోండాం అందించారు. దీనికి పవన్ అంగీకరించలేదు. ‘రైతుల కష్టాలు ఎప్పుడు తీరుతాయో అప్పుడే  కొబ్బరి నీళ్లు తాగుతాను..’ అంటూ ఆ బోండాన్ని తిరిగి ఇచ్చేశారు.