పవన్‌ కల్యాణ్‌కు షాక్.. కేసు పెట్టిన జనసేన నేత - MicTv.in - Telugu News
mictv telugu

పవన్‌ కల్యాణ్‌కు షాక్.. కేసు పెట్టిన జనసేన నేత

December 7, 2019

Pawan.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆ పార్టీ నేత కేసు పెట్టారు. కులమతాలను రెచ్చగొట్టేలా పవన్ మట్లాడుతున్నారని జనసేన క్రైస్తవుల సంఘం నేత అలివర్ రాయ్ ఆరోపించారు. పున్నమిఘాట్‌లో మత మార్పిడిలు జరుగుతున్నాయంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని తెలిపారు. 

పవన్ కళ్యాణ్ దిగజారి మాట్లాడుతున్నారని, తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయినా పవన్‌లో ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. పవన్‌లో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించకపోవడం వల్లే కేసు పెట్టానని అలివర్ రాయ్ స్పష్టంచేశారు.

కాగా, జగన్ నివాసానికి కూతవేటు దూరంలో కృష్ణా పుష్కర ఘాట్ వద్ద సామూహిక మత మార్పిడి జరిగితే ప్రభుత్వానికి కనిపించడం లేదా అని పవన్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఎవరి అండతో మత మార్పిడులు జరుగుతున్నాయని.. హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన దేవాదాయ శాఖ కానీ, ప్రజా ప్రతినిధులు కానీ దీనిపై స్పందించలేదని పవన్ విమర్శించారు.