జగన్‌ను కొంగతో పోల్చిన పవన్ కళ్యాణ్ - MicTv.in - Telugu News
mictv telugu

జగన్‌ను కొంగతో పోల్చిన పవన్ కళ్యాణ్

November 10, 2022

కడప జిల్లా యోగి వేమన యూనివర్శిటీలోని వేమన విగ్రహం తొలగింపుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఆసక్తికర ట్వీట్లు చేశారు. వేమన విగ్రహాన్ని తొలిగించి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. యోగి వేమన పద్యాలతో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మీడియాలో వచ్చిన కథనాల ఫోటోను ట్వీట్ చేసి విమర్శలు చేశారు.

‘విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన ఎప్పటికీ విద్వాంసుడు కాలేరని.. రాజహంసల సమూహంలో కొంగ ఉన్నంత మాత్రాన రాజహంస అవదు’అంటూ పద్యంతో పాటూ తాత్పర్యాన్ని ప్రస్తావించారు. దుర్మార్గుడు సంఘానికి ఏ విధంగానూ ఉపయోగపడడు,అంతేకాదు హాని కూడా చేస్తాడు’అంటూ మరో ట్వీట్ చేశారు. సీఎం జగన్‌ను ఉద్ధేశించే పవన్ ఈ ట్వీట్లు చేసినట్లు తెలుస్తోంది.

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2006లో వేమన పేరుతో కడపలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. యూనివర్శిటీ ముందు వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు యూనివర్శిటీ అధికారులు ఆ విగ్రహాన్ని తొలగించి గేటు పక్కన పెట్టారు. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామంటున్నారు.