Pawan kalyan slams ysr congress leaders
mictv telugu

ఒరేయ్ వైసీపీ కొడకల్లారా, చెప్పుతీసి.. పవన్ కల్యాణ్ ఫైర్

October 18, 2022

 

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రెచ్చిపోయారు. వైసీపీ నాయకులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘‘ఒరేయ్ కొడకల్లారా, వెధవల్లారా, గూండాల్లారా.. ఖబడ్దార్.. చెప్పుతీసి కొడతా. బాపట్లలో గొడ్డు కారం తిన్నానురా. నేనెంత సంపాదించానో మీకు తెలుసారా? 8ఏళ్లలో ఆరే సినిమాలు మాత్రమే చేశారా? నన్ను తిట్టేంత అర్హంత ఉందరా మీకు.. బంతి పూబంతి చామంతిగాల్లారా..’ అని భగ్గుమన్నారు. తన మూడు పెళ్లిళ్లపై విమర్శలపై ఘాటుగా స్పందించారు. ‘నేను విడుకులిచ్చి పెళ్లి చేసుకున్నాను. ఒక్క పెళ్లి చేసుకుని 30 ఉంపుడుగత్తెలను ఉంచుకోలేదు. సభ్యత, సంస్కారం, మట్టీ మశానం ఉన్నాయని మూసుకుని కూర్చున్నాను. కానీ మీ దుర్మార్గమైన మాటలకు ఇక స్పందిస్తాను. ఒరే కొడకల్లా, వెధవల్లారా, సన్నాసుల్లారా ఇంట్లోకి వచ్చి కొడతా..’ అని హెచ్చరించారు.

‘ప్యాకేజ్ స్టార్ అంటే మెడ పిసికి చంపేస్తాను. నిల్లోబెట్టి తోలు తీస్తాను. ఒక్కొక్క నాకొడుక్కి తోలుతీస్తాను. ఇంతవరకు నా సహనమే చూశారు.. ఇప్పుడు నా తడాఖా చూస్తారు, నా రాజకీయమేంటో చూస్తారు.’ అంటూ చెప్పు చూపించారు. ఎంతమంది వస్తారో రండని సవాలు చేశారు. పవన్ మంగళవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడారు. తన రాజ్యాంగం భారత రాజ్యాంగమని, భావ ప్రకటన హక్కను తాను కూడా స్వేచ్ఛగా ప్రకటిస్తున్నానని తన విమర్శలను సమర్థించుకున్నారు. వైసీపీలో అందరూ వెధవల్లేరని, కొంతమంది మంచివాళ్లు కూడా అన్నారన్నారు.