పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిన్మా హిరో కంటే సింగర్ గా బాగా సెట్ అయ్యేట్లుంది. ఈయన మరో సారి తన గాత్రాన్ని జనాలకు విన్పించబోతున్నారు. ఇంతకు ముందు అత్తారింటికి దారేది సిన్మాలో కాటమరాయుడా…. కదిరి నర్సింహుడా పాట పాడి అదరగొట్టారు. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న మరో సిన్మాలో పవన్ హిరోగా యాక్ట్ చేస్తున్నారు. ఇదేసిన్మాలో పవర్ స్టార్ ఒక పాట కూడా పాడుతున్నారు. పవన్ సాంగ్ ఉందని తెలియడంతో సిన్మాపై అంచనాలు మరింత పెరిగి పోయాయి.
ఈ సిన్మాలో కీర్తీ సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హిరోయిన్లుగా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. సిన్మ ఇంకా విడుదల కాక ముందే ఓ తెలుగు టీవి ఛానెల్ శాటిలైట్ హక్కులను సుమారు 20కోట్లుకు కొన్నదట. మరదే పవర్ స్టార్, త్రివిక్రమ్ కాంబినేషన్ ఎఫెక్ట్ అంటే.