పవన్ కల్యాణ్ తలతిక్కగా మాట్లాడాడు: నారాయణ - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ కల్యాణ్ తలతిక్కగా మాట్లాడాడు: నారాయణ

March 19, 2022

13

జనసేన అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్‌పై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో జనసేన ఆవిర్భావ సభ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలపై నారాయణ విరుచుకుపడ్డారు. అటు ఇటు కాకుండా పవన్ కల్యాణ్ తలతిక్కగా మాట్లాడారంటూ విమర్శించారు.

ఈ సందర్భంగా సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. ”రాజకీయంగా కన్ఫ్యూజన్‌లో ఉన్న పవన్ కల్యాణ్, క్యాడర్‌ను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు” అని సెటైర్లు వేశారు. దీంతో జనసేన పోతిన మహేష్ సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యలపై మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌కు ఉచిత సలహాలు ఇవ్వద్దని సూచించారు. ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలో ఒకరు చెప్తే, నేర్చుకునే పరిస్థితిలో పవన్ కల్యాణ్ లేరని హెచ్చరించారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో 27 శాతం ఓటు బ్యాంకుతో జనసేన బలంగా దూసుకెళ్తుందని అన్నారు.

మరోపక్క బీజేపీ రోడ్ మ్యాప్‌లో జగన్ నడుస్తున్నారు. త్వరలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాస్తవాలు తెలుసుకుంటారు. బీజేపీ, జనసేనల మధ్య త్వరలోనే తెగదెంపులు జరుగుతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం నారాయణ కూడా పవన్ కల్యాణ్ మాటలపై వ్యాఖ్యలు చేయడం జనసేన పార్టీ కార్యకర్తల్లో సంచలనంగా మారింది.