గబ్బర్ ఈజ్ బ్యాక్..షూటింగ్‌లో పాల్గొన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్! - MicTv.in - Telugu News
mictv telugu

గబ్బర్ ఈజ్ బ్యాక్..షూటింగ్‌లో పాల్గొన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్!

January 21, 2020

n mth

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ మేకప్ మేసుకోవడానికి సిద్దమయ్యాడు. ‘అజ్ఞాత‌వాసి’ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. బాలీవుడ్‌లో భారీ విజయం సాధించిన ‘పింక్‌’ సినిమాను తెలుగులో ప‌వ‌న్ కళ్యాణ్ రీమేక్ చేస్తున్నాడు. 

బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ పోషించిన పవర్ ఫుల్ లాయర్ పాత్ర‌లో పవన్ నటిస్తున్నాడు. ప‌వ‌న్ 26వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘లాయ‌ర్ సాబ్’ అనే టైటిల్‌ పెట్టారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు వేణు శ్రీరామ్ తెర‌కెక్కిస్తున్నాడు. తాజాగా ప‌వ‌న్ షూటింగ్‌లో పాల్గొన్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.