వారిని చేర్చుకోండి ప్లీజ్..కేసీఆర్‌కు పవన్ విజ్ఞప్తి - MicTv.in - Telugu News
mictv telugu

వారిని చేర్చుకోండి ప్లీజ్..కేసీఆర్‌కు పవన్ విజ్ఞప్తి

November 21, 2019

Pawan kalayn.............................

నెలన్నరగా కొనసాగిన తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు నిన్నటితో తెరపడింది. తాము తిరిగి విధుల్లో చేరతామని, తమపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవద్దని కార్మికులు కోరారు. సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాలు నేతలు నిన్న సమావేశమై చర్చించారు. తర్వాత 47 రోజులుగా సాగుతున్న సమ్మెను విరమిస్తామంటూ ప్రకటన విడుదల చేశారు. 

‘ప్రభుత్వం ఆర్టీసీని ఒక ఆదర్శ ఉద్యోగ సంస్థగా చూడాలి. సమ్మెకు ముందున్న పరిస్థితిని కల్పించి ఎలాంటి షరతులు లేకుండా విధులను నిర్వర్తించడానికి అనుకూల వాతావరణం కల్పిస్తే సమ్మెను విరమిస్తాం.. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి’ అని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కార్మికులకు అండగా నిలిచారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పెద్ద మనసుతో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ పెద్దగా వారి వేదనను అర్ధం చేసుకోవాలన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.