పవన్ కల్యాణ్ ఒంటిపూట భోజనం.. 4 నెలలపాటు.. - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ కల్యాణ్ ఒంటిపూట భోజనం.. 4 నెలలపాటు..

July 3, 2020

Pawan Kalyan Take Food in Single Time

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నాలుగు నెలల పాటు ఆయన కఠిన ఉపవాస దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. దీక్ష చేసిన రోజుల్లో కేవలం  ఒంటిపూట మాత్రమే భోజనం తీసుకుంటూ భక్తి శ్రద్ధలతో గడపాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ.. చాతుర్మాస్య దీక్షను ప్రారంభించారు. బుధవారం తొలి ఏకాదశి సందర్భంగా ప్రారంభించి ఆశ్వయుజ మాసంలో ముగించనున్నారు.  

ఈ ఉపవాస దీక్ష ఉన్న రోజుల్లో ఒంటిపూట మాత్రమే భోజనం చేసి నియమబద్ధ జీవితాన్ని గడపనున్నారు.దీక్షను విరమించే సమయంలో హోమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సూర్యాస్తమయం తర్వాత పాలు, పండ్లు తీసుకుంటారు. కరోనా వైరస్ పట్టి పీడిస్తోన్న సమయంలో  ప్రజలు ఆర్థికంగా, మానసికంగా ఎదుర్కొని ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకున్నట్టు ఆకాంక్షించినట్టుగా పవన్ కల్యాన్ పేర్కొన్నారు. కరోనా కారణంగా  లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి నుంచి ప్రజలంతా కోలుకొని మనోధైర్యంతో ఉండాలని ఈ ఏడాది దీక్ష తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు. కాగా జనసేనాని గత 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా నాలుగు నెలల పాటు ఈ కఠిన ఉపవాస దీక్షలు చేస్తూనే ఉన్నారు.