జగన్ ఆరు నెలల పాలనపై.. పవన్ ఆరు పదాల ట్వీట్ - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ ఆరు నెలల పాలనపై.. పవన్ ఆరు పదాల ట్వీట్

November 23, 2019

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి పాలనపై జనసేన అధినేత పవన్ కల్యాన్ వ్యంగ్యాస్త్రాలు సందించారు. ఆయన ఆరు నెలల పాలనను ఆరు పదాల్లో చెప్పొచ్చంటూ పేర్కొన్నారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన పాలనా తీరును విమర్శించారు. ‘శ్రీ జగన్ రెడ్డిగారి ఆరు నెలల పాలన ఆరు మాటల్లో చెప్పాలంటే విధ్వంసం, దుందుడుకు తనం, కక్ష సాధింపుతనం, మానసిక వేదన, అనిశ్చితి, విచ్ఛిన్నముగా చెప్పొచ్చు’ అంటూ ట్వీట్ చేశారు.

వీటన్నింటికి వివరణ కూడా ఆయన ఇచ్చారు. 151 సీట్లున్న వైసీపీ పాలన హానికర  ధోరణినిగా మారిందని మండిపడ్డారు. ఇకనైనా అటువంటి వాటిని ఆపాలని కోరుకుందామని అన్నారు. కాగా జగన్ అధికారంలోకి రాగానే ఆరు నెలల వరకూ ఎటువంటి విమర్శలు చేయమని గతంలో పవన్ ప్రకటించారు. కానీ జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్పందించాల్సి వచ్చిందని పదే పదే వైసీపీ సర్కార్‌పై పవన్ విమర్శలు చేశారు. తాాజాగా ఆరునెలల పాలన ఎలా ఉందనే అంశాన్ని వివరిస్తూ ట్వీట్ చేశారు.