పవన్ కల్యాణ్ అకౌంట్ హ్యాక్! - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ కల్యాణ్ అకౌంట్ హ్యాక్!

May 17, 2017


వాల్డ్ ని షేక్ చేస్తోన్న వాన్నా క్రై వైరస్ ఎఫెక్ట్ జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కు తాకింది . భారత దేశంలో అతిపెద్ద సంఖ్యలో ఫాలోవర్లు కలిగిన పవన్ కల్యాణ్ ట్విట్టర్ అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. హైదరాబాద్‌లో ‘దద్దరిల్లిన ధర్నాచౌక్’ అంశంపై స్పందించడానికి ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటే పాస్‌వర్డ్ ఛేంజ్ అయినట్లు మెసేజ్ డిస్‌ప్లే అయిందని పవన్ సన్నిహితుల నుంచి అందిన సమాచారం. మూడు రోజుల క్రితమే ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే అవలేదని, ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చని పవన్ భావించాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు. అయితే చివరిగా తన అకౌంట్ హ్యాక్ అయినట్లు పవన్ కల్యాణ్ గుర్తించారని తెలిసింది.మరోవైపు పవన్ కల్యాణ్ అకౌంట్ నుంచి ఏమైనా మెసేజ్ లు వచ్చినా పట్టించుకోవద్దని జనసేక తెలిపింది.

HACK:

  • Pawan Kalyan’s Twitter Account Hacked by Unknown Persons.
  • Janasean PArty releases a press note to Ignore false message from Pawan’s Twitter account.