Pawan Kalyan Unstoppable 2 Episode With Balakrishna Streaming Cancel
mictv telugu

ఆహా సంచలనం.. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ క్యాన్సిల్..!

January 3, 2023

pawan kalyan balakrishna unstoppable episode streaming cancel

అంబరాన్నంటిన సంబరాలతో అట్టహాసంగా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. రెండు రోజులంతా ఇదే హడావిడి. అన్ స్టాపబుల్ సెట్స్ లో పవన్ కోసం బాలయ్య వెయిట్ చేయటం.. రాగానే లేచి హత్తుకోవటం.. షూట్ లో ఈ ప్రశ్నలు, ఆ ప్రశ్నలు అంటూ తెగ కథనాలు. ఒక్క రోజులోనే షూట్ ముగించి సంక్రాంతి కానుకగా ఎపిసోడ్ టెలికాస్ట్ అంటూ అభిమానులకి అల్లు అరవింద్ అద్దిరిపోయే శుభవార్త చెప్పారు. ఇంకేముంది ఫ్యాన్స్ ఫుల్ ఖుషి. దాయాదులైన మెగా నందమూరి అభిమానులంతా ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తుంటే.. ఆహ టీమ్ ఇప్పుడు వాళ్ళకి భారీ షాక్ ఇచ్చేసింది. జనవరి 12న పవన్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అంటూ వచ్చిన ఊహాగానాలతో ఏర్పడ్డ ఫ్యాన్స్ ఉత్సాహానికి బ్రేక్స్ వేశారు. అందరు అనుకున్నట్టు అన్ స్టాపబుల్ పవన్ ఎపిసోడ్ సంక్రాంతి నుండి తప్పుకుంది. బాలయ్య పవన్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ని నిలిపివేసింది ఆహ.

పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ కి అనూహ్యంగా బాలకృష్ణ వీరసింహారెడ్డి మూవీ టీమ్ ఇంటర్వ్యూ ఉండనున్నట్టు అధికారిక ప్రకటన చేసి.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది ఆహ. ఈ సందర్భంగా ట్విట్టర్ లో ఆహా ప్రకటన చేసింది. దాంతో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు పోసినట్టు అయిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని పండగ సీజన్ నుండి తప్పించి.. మరో డేట్ ని కూడా అనుకుంటున్నారట. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ బాలయ్యల ఎపిసోడ్ టెలికాస్ట్ ఉండనుందట. అయితే జనవరి 26 స్ట్రీమింగ్ కి మంచి డేటే కానీ.. సంక్రాంతి అయితే వరుసగా సెలవులు వస్తాయి కాబట్టి పవన్ ఎపిసోడ్ మరింత వైరల్ అయ్యే అవకాశాలు ఉండేవని, అనవసరంగా క్యాన్సిల్ చేశారని అభిమానాలు మండిపడుతున్నారు. ఇక సంక్రాంతికి మాత్రం పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రోమోలను విడుదల చేయాలని ఆహ టీమ్ భావిస్తోందట.

ఇవి కూడా చదవండి :

బ్లూ ఫిలిమ్స్ పై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్

మైండ్ బ్లోయింగ్ మాస్.. రవితేజకి తోలి 100కోట్లు ?

ఫెమస్ బిగ్ షాట్ తో.. యాంకర్ శ్రీముఖి పెళ్లి ఫిక్స్.. అధికారిక ప్రకటన ?

బీజేపీని దెబ్బ కొట్టింది నినే.. కేసీఆర్ కాదు ED,CBI ఎవనికి భయపడేది లేదు.. ఎమ్మెల్యే కొనుగోలు పై పైలట్ రోహిత్ రెడ్డి