Pawan Kalyan Walking On Road At Night After Murder Attempt Allegations
mictv telugu

నడిరోడ్డుపై పవన్ కళ్యాణ్.. హత్య యత్నం తరువాత, వీడియో వైరల్

November 4, 2022

Pawan Kalyan Walking On Road At Night After Murder Attempt Allegations

గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక ముఠాను పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది పట్టుకుని జూబ్లీహిల్స్ పోలీసులకి అప్పచెప్పారు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ జరుగుతున్నా సమయంలో కొన్ని సంచలన విషయాలు బయటికొచ్చాయి. కొన్ని మీడియా సంస్థల కథనాల ప్రకారం పవన్ కళ్యాణ్ పై హత్యాయత్నం కుట్ర జరిగిందని.. పవర్ స్టార్ ని చంపడానికి 250కోట్ల సుపారీ ఇచ్చారని.. దాని కోసమే పవన్ కళ్యాణ్ ఇంటిదెగ్గర దుండగులు రెక్కీ నిర్వహించారని వార్తలొచ్చాయి. ఆంద్ర ప్రదేశ్ లో అభిమానులు పెద్ద ఎత్తున ఉంటారు కాబట్టి హత్యకి హైదరాబాద్ అయితేనే బెటర్ అని దుండగులు ప్రణాళికలు రచించారని.. ఈ హత్యకు సంబంధించిన సుపారీపై కేంద్ర విజిలెన్స్ ఏజెన్సీకి సవివరమైన నివేదిక ఉందని కూడా ఒక ఛానెల్ పేర్కొంది.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి వ్యక్తిగత సిబ్బంది మరింత పెంచేశారు. షూటింగ్ సమయంలోను భద్రత సిబ్బంది పవన్ వెన్నంటి ఉండేలా ఏర్పాట్లు చేశారు. సెట్స్ లో పవన్ ని కలవడానికి ఎవ్వరికి అనుమతులు సైతం ఇవ్వటం లేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒంటరిగా రోడ్డుపై నడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో సినిమా షూటింగ్ లో తీసిందని తెలుస్తుంది. అయితే ఏ మూవీ షూటింగ్, ఎక్కడ ఈ వీడియో తీశారన్నది క్లారిటీ లేదు. ఇక ఈ వీడియోలో బ్లాక్‌ టీషర్ట్‌, బ్లూ జీన్స్‌ ధరించి పవన్ నడిరోడ్డుపై నడుస్తుండగా.. గుర్తుపట్టిన అభిమానులు కేకలు వేస్తుంటే వారికి అభివాదం చేస్తూ పవన్‌ ముందుకు సాగిపోయారు. పవన్‌ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఈ వీడియో షూటింగ్‌ స్పాట్‌లోది అయి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.