ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో నిత్యం బిజీగా ఉంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అనుకున్నట్లుగానే తాను ఓకే చెప్పిన సినిమాలకు షూటింగ్ పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రాజకీయాల్లోనూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటు సినిమాలు, అటు రాజకీయాలతో మిగతా పనులకు బ్రేక్ పెట్టాల్సి వస్తోంది. ఈనేపథ్యంలో కన్నడ స్టార్ హీరోలు అయిన ఉపేంద్ర, కిచ్చా సుదీప్ లకు పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పారు. వారిద్దరూ కలిసి యాక్ట్ చేసిన కబ్జా సినిమా ఫంక్షన్ కు హాజరుకాలేపోతున్నానంటూ పవన్ వారికి క్షమాపణ చెప్పారట.
కబ్జా ఆడియో ఫంక్షన్ కు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే రాజకీయపరంగా ముందు నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల నేను ఈ ఈవెంట్ కు హాజరుకాలేపోతున్నాను. దీనికి నేను చాలా బాధపడుతున్నాను. ఉపేంద్ర, సుదీప్ కు నా ప్రత్యేక శుభాకాంక్షలు అని తెలిపారు. ఇద్దరు ప్రత్యేకమైన పాత్రలు పోషిస్తూ పలు భాషల్లో గుర్తింపు పొందారని పవన్ కల్యాణ్ చెప్పారు. కబ్జా మూవీ మంచి విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ చిత్ర యూనిట్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నారు.