Pawan Kalyan who told the details of his remuneration
mictv telugu

తన రెమ్యూనరేషన్ వివరాలను చెప్పిన పవన్ కళ్యాణ్

October 18, 2022

అమరావతిలోని జనసేన కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. తనను ప్యాకేజీ స్టార్ అంటున్న వైసీపీ నేతల కామెంట్లపై మండిపడ్డారు. తనపై మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానని హెచ్చరించారు. ఈ సందర్భంలో తన రెమ్యునరేషన్ వివరాలతో పాటు.. తాను ఎన్ని సినిమాలు చేశారు.. ఎంత సంపాదించారు.. అందులో టాక్స్ ఎంత కట్టారు? జీఎస్టీ ఎంత? పార్టీ నడపడానికి ఎంత అవుతుంది? బిల్డంగ్ కట్టడానికి ఎంత ఖర్చు అయ్యింది తదితర వివరాలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఒక కారు కొనుక్కుంటే.. డబ్బులు వాళ్లు ఇచ్చారా? వీళ్లు ఇచ్చారా? అంటున్నారు.. ఒరేయ్ సన్నాసుల్లారా? వెధవల్లారా? మీకు నేను ఎంత సంపాదిస్తున్నానో తెలుసరా?? అంటూ తన రెమ్యునరేషన్ వివరాలను సంపాదించిన సంపాదనను తెలియజేశారు పవన్ కళ్యాణ్.

జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి లెక్కను చెబుతానన్న పవన్.. గత 8 ఏళ్లలో తాను ఆరు సినిమాలు చేశానని.. రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు సంపాదించానని.. రూ.33.37 కోట్ల ఇంకమ్‌ట్యాక్స్ కట్టానని వివరించారు. తన పిల్లల కోసం కట్టిన ఫిక్స్‌డ్ డిపాజిట్లు తీసి మరీ పార్టీకి ఖర్చు చేశానని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లోని సీఎం రిలీఫ్ ఫండ్, అయోధ్య రామ మందిర నిర్మాణానికి లక్షలాది రూపాయలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. జనసేన 5 ఖాతాల్లో రూ. 15.58 లక్షలు కార్పస్ ఫండ్ ఉందన్నారు. రైతు భరోసా కోసం రూ. 3.50 కోట్ల నిధులు జనసేన వద్ద ఉన్నాయని తెలిపారు. నా సేన-నావంతు విరాళాల రూపంలో రూ. 4 కోట్లకు పైగా ఉన్నాయన్నారు.

పవన్ కళ్యాణ్ రెమ్యూనరేష్ వివరాలు తెలియజేయడంతో.. టాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్‌పై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రకటించిన లెక్కల్లో ఆరు సినిమాలకు సగటున రూ.120 కోట్లు అంటే.. సినిమాకి కేవలం రూ.20 కోట్లు అన్నమాట. ఈ లెక్కన చూస్తే.. టాలీవుడ్‌లో ఉన్న సెకండ్ గ్రేడ్ మినిమమ్ గ్యారంటీ హీరోలు రవితేజ, నాని, శర్వానంద్, రామ్, నితిన్‌లు దాదాపుగా సినిమాకి రూ.20-30 కోట్లు తీసుకుంటున్నారనే టాక్ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ మరీ సినిమాకి రూ.20 కోట్లు తీసుకోవడం ఏంటనే చర్చ నడుస్తోంది.