త్వరలో తెలంగాణలో పర్యటించనున్న పవన్ కల్యాణ్.. ఎందుకంటే - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలో తెలంగాణలో పర్యటించనున్న పవన్ కల్యాణ్.. ఎందుకంటే

April 19, 2022

8

పవర్ స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ త్వరలో తెలంగాణలో పర్యటిస్తారని ఆ పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇటీవల నల్గొండ జిల్లాలో మరణించిన ఇద్దరు జనసేన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సహాయం చేస్తారని తెలిపారు. చౌటుప్పల్‌లో సైదులు, హుజూర్ నగర్‌లో కడియం శ్రీనివాస్‌లు తమపై నమ్మకంతో ఇన్నేళ్లు కలిసి ప్రయాణించారని, వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. తమకు తెలంగాణలో కేడర్ లేదని విమర్శిస్తున్నారని, ఉభయ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలతో పాటు గ్రేటర్ హైదరాబాదులో కూడా తమకు బలమైన కేడర్ ఉందని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్‌ను చూసి ఎంతో మంది యువత తమ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.