ఆడపడచుల ఆత్మగౌరవం కోసం పవన్ కమిటీ.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆడపడచుల ఆత్మగౌరవం కోసం పవన్ కమిటీ..

April 23, 2018

క్యాస్టింగ్ కౌచ్‌పై నిరసన గళమెత్తి ఉద్యమిస్తున్న యువనటి శ్రీరెడ్డి పోరాటం ఫలితమిస్తోంది. సినీపరిశ్రమలోని మహిళల సమస్యల పరిష్కారం కోసం జనసేన అధినేత, పవన్ కల్యాణ్ ముందుకొచ్చారు. త్వరలోనే తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆడపడుచుల ఆత్మ గౌరవ పోరాట సమితిని ఏర్పాటు చేస్తామని ఆయన ట్విటర్లో తెలిపారు.“త్వరలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి” ఏర్పాటుకి రంగం సిద్ధం అవుతోంది. వీరికి జనసేన “వీరమహిళా”విభాగం అండగా ఉంటుంది’ అని ఆయన వెల్లడించారు. కాగా, ‘మనల్ని, మన తల్లుల్ని, ఆడపడుచుల్ని తిట్టే పేపర్లు ఎందుకు చదవాలి? వాళ్ళ టీవీలు ఎందుకు చూడాలి’ అని ఆయన తన అభిమానునుద్దేశిచిం మరో ట్వీట్ చేశారు. ‘తన తల్లిని బహిరంగంగా దూషించిన వారు రహస్యంగా క్షమాపణలు చెబుతున్నారని మరో ట్వీట్లో మండిపడ్డారు. ఇలాంటివి తన దగ్గర కుదరవని హెచ్చరించారు. ‘గత ఆరు నెలలుగా నా తల్లిని, అభిమానులను, అనుచరుల్ని నోటికొచ్చినట్లు తిట్టారు. ఇంతటి నీచబుద్ధి ఉన్న మీరు ఇప్పుడు రహస్యంగా క్షమాపణలు చెప్తారా?‘ అని విమర్శించారు.