మచిలీపట్నం వేదికగా మంగళవారం జరిగిన జనసేన ఆవిర్భావ సభలో వైసీపీ నాయకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తాను ప్యాకేజీ తీసుకున్నాని ఆరోపణలు చేస్తే తెనాలి చెప్పుతో కొడతానంటూ హెచ్చరించారు. కులం పేరుతో మాట్లాడితే సమాజం విచ్చినమవుతుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేవారు. నాకు రూ.1000కోట్లు ఆఫర్ చేశారంటూ ప్రచారం చేస్తున్నారు. డబ్బుతో మీ గుండెల్లో స్థానం ఎలా సంపాదిస్తానంటూ పవన్ ప్రశ్నించారు.
గతంలో ప్యాకేజ్ అంటే చెప్పు చూపించా. ఆ చెప్పులు తెనాలిలో తయారయ్యాయి. ఈసారి చెప్పు చూపిస్తే వాటితోనే కొడతానంటూ హెచ్చరించారు. తాను డబ్బులకు ఆశపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. పార్టీ పెట్టినప్పుడు తనకు రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియవని చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడగు వేయనని వ్యాఖ్యానించారు. ప్రతిఒక్కరికీ మేలు చేయాలన్న ఉద్దేశ్యంతోనే తాను పార్టీ పెట్టినట్లు చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్.
కాగా తాను చిన్నప్పట్నుంచీ సమాజ శ్రేయస్సు కోసమే తపనపడేవాడిని అంటూ వెల్లడించారు. ధైర్యం చేసి పార్టీ పెట్టానంటూ చెప్పుకొచ్చారు. పదేళ్ల కిందట తాను పార్టీ పెట్టినప్పుడు తనకు అండగా ఎవరూ లేరన్నారు పవన్. జనసేన పార్టీని ఏడు సిద్దాంధాల ఆధారంగా ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఒక కులానికి అనుకూలంగా, మరో కులానికి వ్యతిరేకంగా తాను ఎప్పుడూ పనిచేయనని స్పష్టం చేశారు. ఖచ్చితం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుంతుందన్నారు. జనసేనకు 6లక్షల క్రియాశీలక కార్యకర్తలున్నారని స్పష్టం చేశారు. కులాలను కలపాలన్నదే పవన్ అభిమతమన్న ఆయన పులివెందులతో సహా రాష్ట్ర వ్యాప్తంగా తనకు అభిమానులు ఉన్నారని తెలిపారు.