You just witnessed made in the Andhra student in theatres, You are about to witness the king of Andhra 👑🔥#Jalsa4K #Jalsa4KCelebrations #ThammuduSpecialShow #Thammudu pic.twitter.com/ayU75fVq91
— Sardaar S (@SardaarSainik) September 1, 2022
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్ల వద్ద పవన్ కల్యాణ్ అభిమానులు, సినీ ప్రేక్షకులు భారీగా దర్శనమిస్తున్నారు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 2) సందర్బంగా ఆయన కెరీర్లో సూపర్ హిట్స్ సినిమాలుగా పేరుగాంచిన ‘తమ్ముడు’ సినిమాను ఆగస్టు 31న పలు థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నామని బుధవారం రోజున మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో ప్రసాద్ ఐమ్యాక్స్తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నామని యాజమానులు ప్రకటించారు.
Made in andhra student song 🔥🔥🔥
Never before ever after experience Thanq parvathipuram cultss❤️
Experienced Mass Euphoria, #Thammudu
#JalsaOnSep01st 🤙 pic.twitter.com/aY9JrYN4z7— rishi pspk (@rishi_Jpspk) August 31, 2022
దాంతో థియేటర్ల వద్దకు చేరుకున్న పవన్ అభిమానులు..కొత్త సినిమా రిలీజ్ అయితే, ఎంత హంగామా చేస్తారో అంతకంటే ఎక్కువగా హంగామా చేశారు. అంతేకాదు, అన్నీ థియేటర్లు హౌస్‌పుల్ బోర్డులు పెట్టేశాయి. సినిమా హాళ్ల ఎదుట భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి, ‘జై పవన్ కల్యాణ్’ అంటూ నినాదాలు చేస్తూ అభిమానులందరూ డ్యాన్స్‌లు చేశారు. థియేటర్ల లోపల కూడా ఇలాంటి వాతావరణమే కనిపించింది. పవన్ ఎంట్రీ సీన్స్, ‘మేడ్ ఇన్ ఆంధ్రా స్టూడెంట్’ సాంగ్, క్లైమాక్స్ ఫైట్, ఇలా ప్రతి సీన్‌కు అభిమానులు కాగితాలు ఎగురవేసి డ్యాన్స్‌లు చేశారు.
sompeta lanti chinna vuru lo e range celebrations ante..god of celebratiobs…🙏🙏#Thammudu #Jalsa4K #Pawanakalyan pic.twitter.com/tYofHtpe6o
— Krish 💝 (@Powerstarfanss) September 1, 2022
ఇక, పవన్ కల్యాణ్ నటించిన మరో సూపర్ హిట్ చిత్రం ‘జల్సా’. ఈ చిత్రాన్ని మేకర్స్ రీ రిలీజ్ చేశారు. ఒక్కరోజేలోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 500 కంటే ఎక్కువ షోలు వేస్తున్నారు. ‘జల్సా’ ప్రదర్శిస్తున్న థియేటర్లు హౌస్ ఫుల్ అయిపోయాయి. ముఖ్యంగా ప్రసాద్ ఐమ్యాక్స్, ఆర్టీసీ క్రాస్‌లోని సినిమాహాళ్లలో వేయనున్న అన్ని షోల టికెట్స్ అమ్ముడైపోయాయి. రీ రిలీజ్ చిత్రానికి ఇన్ని షోలు వేయడం, ప్రతిచోటా ఇలాంటి అద్భుతమైన స్పందన రావడం విశేషమని సినీ విశ్లేషకులు వివరాలను తెలియజేశారు. ఈ రెండు రీ రిలీజ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.