Pawan Kalyan's Jalsa movie created a record with 702 special shows
mictv telugu

పవన్ మేనియా : మహేశ్ బాబు పోకిరి రికార్డు బ్రేక్

September 2, 2022

Pawan Kalyan's Jalsa movie created a record with 702 special shows

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు అభిమానులుండరు. భక్తులుంటారని చెప్పే మాట నిజమేననిపిస్తోంది. ఈ మధ్య తమ అభిమాన హీరోల హిట్ చిత్రాలను స్పెషల్ షో వేస్తుండడం తెలిసిందే. మహేశ్ పుట్టినరోజు సందర్భంగా పోకిరి, ఒక్కడు సినిమాలను ప్రదర్శించగా, అత్యధిక కలెక్షన్లు వచ్చాయి.

అదే రికార్డుగా భావిస్తుంటే పవన్ కల్యాణ్ బర్త్‌డే సెప్టెంబర్ 2న ప్రదర్శించిన సినిమాలు ఆ రికార్డును బ్రేక్ చేశాయి. శుక్రవారం పవన్ నటించిన ఖుషీ, జల్సా, తమ్ముడు సినిమాలను ప్రదర్శించారు. వీటిలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా చిత్రం మాత్రం రికార్డు స్థాయిలో ప్రదర్శితమైంది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 702 షోలతో దేశంలోనే కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇండియాలో మరే హీరోకి సాధ్యం కాని రికార్డును లిఖించడంతో పవన్ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.