పవన్ జనసేన షురూ - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ జనసేన షురూ

October 25, 2017

పవన్ కళ్యాణ్  తన పార్టీ ఆఫీసు కార్యాలయాన్ని  ప్రారంభించాడు.  భరత మాతకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం, సర్వమత ప్రార్థనలు చేశాడు. ముస్లిం మత పెద్దలతో పాటు సినీనటుడు అలీ పవిత్ర ఖురాన్‌ను పఠించారు.  క్రైస్తవ మతపెద్దలు బైబిల్‌ స్తోత్రాలతో జనసేనను ఆశీర్వదించారు.

రాజకీయ కార్యకలాపాల కోసం భాగ్యనగరంతోపాటు, అమరావతిలో కార్యాలయాల్ని ఏర్పాటు చేయనున్నట్లు జనసేన వెల్లడించింది.తెలంగాణకు చెందిన నిమ్మల వీరన్న అనే కార్యకర్త ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేద మంత్రాల మధ్య సన్నిహితులు, జనసేన ప్రతినిధులు, అభిమానులతో కలిసి పవన్ జనసేన కార్యాలయంలో అడుగుపెట్టాడు.