నాన్నకు తోడుగా పవన్ చిన్న కొడుకు..జనసేన అభిమానులు ఫిదా - MicTv.in - Telugu News
mictv telugu

నాన్నకు తోడుగా పవన్ చిన్న కొడుకు..జనసేన అభిమానులు ఫిదా

February 4, 2020

p[g b

జనసేన అధినేత పవన్ కల్యాన్ ఫ్యాన్స్‌కు పండగ లాంటి వార్త తాజాగా బయటకు వచ్చింది. ఆయన చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనో విచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జనసేన పార్టీ ముద్రతో పవన్ ఫొటో ఉన్న తెల్లటి కుర్తా ధరించి నడుచుకుంటూ వస్తున్నాడు. దీన్ని చూసిన ఆయన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. తమకు మరో బుల్లి పవర్ స్టార్ దొరికేశాడంటూ కామెంట్లు పెడుతున్నారు. 

పవన్ కల్యాన్, అన్నా లెజినోవా దంపతుల కుమారుడిని చూసేందుకు ఆయన అభిమానులు తెగ ఆసక్తి చూపుతున్నారు. ఈ సమయంలో ఏకంగా తమ పార్టీ సింబల్ ముద్రించి ధరించిన కుర్తాతో బయటకు రావడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయి. కాగా గత ఎన్నికల్లో పరాజయం తర్వాత పవన్ కల్యాన్ ప్రజా సమస్యలపై మరింత ఫోకస్ పెట్టారు. కేంద్రంలో బీజేపీతో సన్నిహితంగా మెదులుతూ.. పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు సినిమా, ఇటు పొలిటికల్ లైఫ్ రెండింటిలోనూ ఆయన బిజీ అయిపోయారు.