Pawan Kalyan's movie directed by Chandrababu!
mictv telugu

చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌కల్యాణ్ సినిమా..!

October 20, 2022

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజీ స్టార్. టాలీవుడ్ లో ఆయనో సూపర్ హీరో. కేరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్…మరెన్నో ఫ్లాపులు.ఇండస్ట్రీలో పవన్ సినిమా
షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి రిలీజ్ వరకు ఏ అప్ డేట్ వచ్చినా ఫ్యాన్స్ కు పండుగ. రాజకీయాల్లోకి వెళ్లాక పవన్ కల్యాణ్ సినిమాలు బాగా తగ్గాయి. చేసిన నాలుగైదు సినిమాలు బంపర్ హిట్ కొట్టాయి. ఈ క్రేజ్ ను ఇప్పుడు చంద్రబాబు వాడుకోవాలనుకుంటున్నారు. పొలిటికల్ స్క్రీన్ పై బంపర్ హిట్ కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది పక్కా రాజకీయ చిత్రం. రీల్ లైఫ్ కాదు రియల్ లైఫ్ మూవీ. అదే ఏపీలో చక్రం తిప్పేందుకు పవన్ కల్యాణ్ హీరోగా చంద్రబాబు సినిమా తీయబోతున్నారు. కథ, స్క్రీన్ ప్లే ,డైరెక్షన్ అంతా చంద్రబాబే. పొలిటికల్ కేరీర్ లో ఒక్క హిట్ లేని పవన్ కల్యాణ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని బాబు స్క్రిప్టు రెడీ చేశారు. 2024లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో…
ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో టీడీపీ అధినేత చంద్రబాబు బాగా తెలుసు.రాబోయే ఎన్నికలకు ఎప్పటినుంచో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. పొలిటికల్ గ్రౌండ్ లో విక్టరీ కొట్టేందుకు పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీతో దోస్తీ చేస్తున్న పవన్ కల్యాణ్ ని దారిలోకి తెచ్చుకున్నారు. ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎవరితోనైనా కలిసి పోరాడుతామని చంద్రబాబు చెబుతున్నారు. అవసరమైతే సీఎం పదవినీ వదులుకోవడానికి సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు. సీఎం అభ్యర్థి ఎవరైనా ఉండొచ్చు కానీ జగన్‌ని దింపేయడమే ఫైనల్ టార్గెట్ అంటూ పొత్తులకు తెరలేపుతున్నారు. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్ తో కలిసి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగన్ పై , వైసీపీ నేతలపై పవన్ కల్యాణ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. చంద్రబాబు మార్క్ డైరెక్షన్‌లో యాక్షన్ ఎపిసోడ్ ఇక్కడే స్టార్ట్ అయింది. ప్రజాస్వామ పరిరక్షణకు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

ఇక్కడే నుంచి బాబు మార్క్ ఈక్వేషన్స్
పవన్ కల్యాణ్ ప్రస్తుతం బీజేపీతో దోస్తీ కొనసాగిస్తున్నారు. ఢిల్లీ పెద్దలతోనూ ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పెద్దలు రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పారని. ఆ రోడ్డు మ్యాప్ కోసమే ఎదురుచూస్తున్నామని గతంలో పవన్ కల్యాణ్ పలుమార్లు ప్రకటించారు. ఇటు బీజేపీతో అటు చంద్రబాబుతోనూ పవన్ కల్యాణ్ పొలిటికల్ ఫ్రెండ్ షిప్ కొనసాగిస్తున్నారు. బాబుతో కలిస్తే బీజేపీకి కటీఫ్ తో చెబుతారా?చంద్రబాబునే బీజేపీతో కలిసేలా చేస్తారా?ఇదే ఏపీలో హాట్ టాఫిక్ గా మారింది. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ అని వైసీపీ నేతలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. అతని చెప్పినట్టే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విరుచుపడ్డారు. మొన్నటి జాయింట్ పీసీతో తమ ఆరోపణలే నిజమయ్యాయని వైసీపీ అంటోంది. ఈ ఎపిసోడ్‌లోనే పవన్‌కు ప్యాకేజ్ స్టార్ అని అవార్డు ఇచ్చేశారు వైసీపీ నేతలు. విశాఖ టూర్ తో వార్ మరింత ముదిరింది. వైసీపీ , జనసేన నేతల తిట్లతో యుద్ధం ఓ రేంజ్ లో నడిచింది. ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొడతానని పవన్ కల్యాణ్ ఊగిపోయారు.

పవన్ కల్యాణ్‌కు వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్
అటు పవన్ కల్యాణ్ కామెంట్స్ కు వైసీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వీళ్లందరినీ మించి ముఖ్యమంత్రి జగన్ డబుల్ డోస్ కౌంటర్ పవన్‌కు ఇచ్చారు. అందరికీ మంచి జరగాలనే 3 రాజధానులు అని మేం అంటున్నాం.. కానీ మంచి జరగాలంటే 3 పెళ్లిళ్లు చేసుకోండని పవన్ అంటున్నారు.. పవన్ వ్యాఖ్యల్ని చూసి మహిళలు సిగ్గుపడుతున్నారన్నారు జగన్. పవన్‌ వీధి రౌడీల్లా బూతులు తిడుతూ చెప్పు చూపిస్తున్నారన్నారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఏం దశ దిశ చేస్తారు? అని జగన్ అవనిగడ్డ సభలో ఫైర్ అయ్యారు. ఒక్కడు ఒకవైపు…వాళ్లందరూ ఒకవైపు ఉండి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

ఏపీలో పొలిటికల్ థ్రిల్లర్
యాక్షన్ ఎపిసోడ్ తో స్టార్ట్ అయిన బాబు మార్క్ సినిమా పొలిటికల్ థ్రిల్లర్‌లా మారుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందోనని జనం చర్చించుకుంటున్నారు. ఊహించని ట్విస్టులు, ఫైట్లతో పీకే సినిమా బంపర్ హిట్ కొడుతుందని తెలుగుతమ్ముళ్లు భావిస్తున్నారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఇందుకోసం అన్నిదారులూ వెతుకుతున్నారు. ఎవరితోనైనా కలవడానికి రెడీ అవుతున్నారు. ఎన్నికల నాటికి అవసరమైతే బీజేపీతో పొత్తుకు సై అనే సంకేతాలు ఇస్తున్నారు.

పవన్ కు బాబు జై కొట్టడానికి ఇదే కారణం
ఏపీలో సామాజిక సమీకరణలపై టీడీపీ చీఫ్ చంద్రబాబుకు పట్టుంది. ఆ పల్స్ పట్టుకున్న బాబు..పవన్ కల్యాణ్‌ని రంగంలోకి దించుతున్నారు. పవన్ కల్యాణ్ సామాజిక వర్గ ఓట్లను రాబట్టుకునే పనిలో పడ్డారు. కాపులు అంతా టీడీపీ, జనసేన వైపు ఉండేలా పవన్ కల్యాణ్‌తో పొత్తుకు సై అంటున్నారు. ఎన్నికల సమయం వరకు తప్పదనుకుంటే పవన్ కల్యాణ్ నే సీఎం అభ్యర్థికి చూపే అవకాశం ఉంది. ఏపీలో ఎప్పుడూ కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకే అధికారమా?కాపులకు అవసరం లేదా? అనే క్యాస్ట్ సెంటిమెంట్ ని బాబు అండ్ కో రగిలించే అవకాశం ఉంది. అందుకే పవన్ ను హీరోగా పెట్టి చంద్రబాబు ఏపీ పొలిటికల్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలా డైరెక్షన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ, బీజేపీ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల్ని ఆకర్షించే ప్రయత్నాలూ కొనసాగుతున్నాయి.