Pawan Kalyans Sensational Comments On Alliances with tdp ,bjp
mictv telugu

పొత్తులపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

January 24, 2023

 Pawan Kalyan's sensational comments on alliances

ఏపీలో రాజకీయాల పార్టీలు ఎన్నికల మూడ్‎లోకి వెళ్లిపోయాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఎవరివారే అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ ప్రణాళికలు రచ్చిస్తుంటే..వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశే లక్ష్యమని జనసేన, టీడీపీ చేతులు కలుపుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చబోమని..ప్రతిపక్షాలన్నీ కలిసిరావాలని పవన్ పదేపదే నొక్కి చెబుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీతో కూడా పవన్ సత్ససంబంధాలను కొనసాగిస్తున్నారు. తాజాగా మరోసారి పొత్తులపై జనసేనాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీతో పొత్తు కొనసాగుతుంది

ఏపీలో బీజేపీతో ప్రస్తుతం పొత్తులో ఉన్నామని..భవిష్యత్తులో కూడా పొత్తు కొనసాగుతుందని చెప్పారు. వారు కాదంటే మాత్రం కొత్త వాళ్లతో పోతాం అని పవన్ స్పష్టం చేశారు. పొత్తులపై ఎన్నికలకు వారం రోజుల ముందు క్లారిటీ వస్తుందని వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల కాంబినేషన్ చూడొచ్చా అన్న ప్రశ్నకు ..కాలమే సమాధానం చెబుతుందని పవన్ అన్నారు. ప్రస్తుతం పొత్తులపై పవన్ చేసిన వ్యాఖ్యాలు ఏపీ రాజికీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ మధ్య చాలా గ్యాప్ పెరిగింది. టీడీపీ అధికారంలో ఉన్న రోజుల్లో విభజన హామీలకోసం మోదీపై చంద్రబాబు పోరాటానికి దిగారు. ఈ క్రమంలో కొన్ని ఏళ్లుగా ఉన్న బీజేపీతో ఉన్న బంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు. ఇటీవల బీజేపీతో మరోసారి చంద్రబాబు కలుస్తారంటూ వార్తలు వస్తున్నా..కమలం నేతలు మాత్రం వాటిని కొట్టిపారేస్తున్నారు. టీడీపీతో కలిసే ప్రస్తక్తే లేదని చెబుతున్నారు.ఇదే వైరం ఎన్నికల వరకు కొనసాగితే..పవన్ ఎవరితో వెళ్తారన్నది సస్పెన్షన్‎గా మారింది.

వారాహికి పూజలు

ఇటీవల రాష్ట్రంలో జనసేనకు విపరీతమైన మైలేజ్ వచ్చింది. విశాఖ, ఇప్పటం ఘటనలు పవన్‌కు కలిసొచ్చాయి. ఈ మైలేజ్‌ను పవన్ కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై లోపాలపై దూకుడుగా ముందుకెళ్తున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఈ పర్యటన కోసం ప్రచార రథం వారాహిని ప్రత్యేక తయారు చేయించారు. తాజాగా వారాహికి కొండగట్టులోని అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి : 

 

అక్కినేనిపై బాలయ్య వివాదాస్పద కామెంట్స్.. ఘోరంగా ట్రోల్ చేస్తున్న అభిమానులు

బాలయ్యకు ఇచ్చి పడేసిన అక్కినేని వారసులు

రాజమౌళి సర్ మిమ్మల్ని చంపేయొచ్చు..సెక్యూరిటీ పెంచుకోండి..