చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ మీటింగ్..! - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ మీటింగ్..!

July 31, 2017

జనసేన అధ్యక్షుడు , పవర్ స్టార్ పవన్ కళ్యాన్ హార్డ్వర్డ్ యూనివర్సిటీ వైద్య బృందంతో కలిసి  చంద్రబాబును  సచివాలయంలో కలిసారు.శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ బాధితుల అంశంపై ఆయన ఈ భేటీలో చంద్రబాబుతో చర్చించారు. ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధులపై హార్వర్డ్‌ వైద్య బృందం చేసిన అధ్యయనం నివేదికను పవన్‌ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అందచేశారు.

ఇటీవల హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ప్రసంగించేందుకు వెళ్లినప్పుడు అక్కడి మెడికల్‌ స్కూల్‌లోని రీనల్‌ విభాగానికి చెందిన ప్రధాన వైద్యుడు డాక‍్టర్‌ జోసెఫ్‌ బెన్వంత్రీతో పవన్‌ చర్చించారు. ఉద్దాన సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పవన్‌ విజ్ఞప్తితో జోసెఫ్‌ తన బృందంతో శనివారం ఉద్దానంలో పర్యటించారు. రోగులతో మాట్లాడి వివరాలు సేకరించారు.కిడ్నీ వ్యాది సమస్యల  పరిష్కారానికి పవన్ చూపిన చొరవను చంద్రబాబు అభినందించారట.