Pawan Met Modi..What Next?
mictv telugu

పవన్ ప్లాన్ ఇదేనా?

November 12, 2022

ప్రధాని మోదీని కలిసిన తర్వాత పవన్ కల్యాణ్ వ్యూహంపై ఉత్కంఠ నెలకొంది. రోడ్‌మ్యాప్ ఇవ్వలేదు కానీ స్పష్టమైన దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది. ఏపీకి మంచి రోజులు తెచ్చే దిశగా చర్చలు ఫలప్రదమయ్యాయని పవన్ కల్యాణ్ మీడియాతో చెప్పారు. పవన్ వ్యాఖ్యల్లో ఇదే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఏపీకి మంచి రోజులు రావాలంటే వైసీపీ పాలన పోవాలని ఎంతో కాలంగా పవన్ చెబుతూ వస్తున్నారు. ఈ మధ్య దూకుడు పెంచారు. ప్రధాని మోదీని కలిసిన ప్రత్యేక వ్యూహం రూపొందించబోతున్నారు. ఆ వ్యూహం ఏంటి?లెఫ్ట్ ఐడియాలజీ, బీజేపీ రోడ్ మ్యాప్.బాబు డైరెక్షన్‌లో పవన్ ఏం చేయబోతున్నారు?

మోదీతో ఏం మాట్లాడారంటే…

సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత ప్రధాని నరేంద్రమోదీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సమావేశం జరిగింది. ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై మాట్లాడారు. అన్ని విషయాల్ని ప్రధాని అడిగి తెలుసుకున్నారు. అవగాహన ఉన్నంతకు మోదీ అడిగిన విషయాలు తెలియజేశానని పవన్ చెప్పారు. ఆంధ్ర పద్రేశ్ ప్రజలు బాగుండాలని, తెలుగు ప్రజలు ఐక్యంగా ఉండాలని అభిలాషించాలని పవన్ వివరించారు. విశాఖలో జరిగిన పరిణామాలపై ప్రధానితో చర్చించారా అని మీడియా అడిగిన ప్రశ్నకు పవన్ సమాధానం దాటవేశారు.ముఖ్యంగా ఏపీలో తాజా పరిస్థితులపై చర్చించనట్లు తెలిసింది.

పవన్ వ్యూహం ఇదేనా?

మోదీతో సమావేశం తర్వాత పవన్ కల్యాణ్ మంచి జోరుమీదున్నారు. మిషన్ 2024 కోసం ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించనున్నారు. ఇందుకోసం విశాఖలో లీడర్లతో సమావేశమయ్యారు. జనసేన ముఖ్యులకు పవన్ కల్యాణ్ దిశా నిర్ధేశం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకోసం ఇప్పటి నుంచే పనిచేయాలని చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుత దూకుడుని మరింత పెంచాలని శ్రేణులకు చెప్పబోతున్నారట. ఏ అవకాశం దొరికినా ఇప్పటం లాగా రచ్చ చేయాల్సిందేనన్నారు. ఇప్పటం ఇష్యూలో టీడీపీ కంటే జనసేనకే మైలేజ్ ఎక్కువ వచ్చింది. భవిష్యత్‌లో కూడా ఇలాగే సేనాని చేయబోతున్నారు. ఇక రోడ్ మ్యాప్ కోసం మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పని సేనానిది.

Pawan Met Modi..What Next?

మోదీ దిక్సూచి

రోడ్ మ్యాప్‌పై మోదీతో పవన్ కల్యాణ్ చర్చించలేదు. ఎందుకంటే ఇది అమిత్ షా లేదా నడ్డాతో కలిసి మాట్లాడాల్సిన అంశం. పార్టీ సుప్రీంవాళ్లే..దిశానిర్ధేశం చేసేది, రోడు మ్యాప్ ఇచ్చేది వాళ్లు. సో ప్రధానితో పవన్ కల్యాణ్ ఈ టాపిక్ తీసుకురాలేదు. మాట్లాడిదల్లా ఏపీలో పరిస్థితులపైనే. మోదీతో భేటి తర్వాత ఏపీ బీజేపీతో కలిసి సేనాని పనిచేస్తారా? వైసీపీ సర్కార్ పై ఉమ్మడి పోరాటాలు చేస్తారా, లేదా అనేది ఆసక్తి రేపుతోంది. ఏపీ బీజేపీతో కలిసి పనిచేస్తే బాబు దోస్తీ ఏం కావాలి? ఎలాగైనా బాబుని బీజేపీని మళ్లీ పవన్ కల్యాణ్ కలుపుతారా అనేది చూడాలి