ఉక్రెయిన్ – రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో కేఏ పాల్ సోషల్ మీడియా వేదికగా గతకొన్ని రోజులుగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఓ ఆసక్తికరమైన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా పవన్ సార్.. కాబోయే ప్రధాని మాటలను వినండి అంటూ ట్వీట్ చేశాడు.
Hey @PawanKalyan sirrrr, ,please listen to the would be P M of INDIA. pic.twitter.com/TzUnFpZDJZ
— Ram Gopal Varma (@RGVzoomin) March 3, 2022
ఇంతకి ఆ వీడియో ఏంటి? ఎందుకు పోస్ట్ చేశాడు? అనే విషయాల్లోకి వెళ్తే.. ‘పవన్ ఫ్యాన్స్ అందరికీ చెపుతున్నా.. పవన్ సీఎం కావాలన్నా, మినిస్టర్ కావాలన్నా ఆయనను ప్రజాశాంతి పార్టీలో చేరమని చెప్పండి. 42 మంది ఎంపీలను గెలిపించుకుందాం. మీరంతా ఓకే అంటే నేను ప్రధానిగా ఉంటా. పవన్ను కావాలంటే ముఖ్యమంత్రిని చేద్దాం’ అని కేఏ పాల్ అన్నారు.
మరోపక్క ఆర్జీవీ ఇటీవలే ‘భీమ్లా నాయక్’ సినిమాపై కూడా పలు ట్వీట్లు చేశాడు. తాజాగా పవన్ కల్యాణ్ గురించి కేఏ పాల్ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ.. ‘హేయ్ పవన్ సార్… కాబోయే ప్రధాని చెప్పేది విను’ అని కామెంట్ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.