జనసేన కార్యకర్త ఇంటికి పవన్.. నేలపైనే నిద్ర - MicTv.in - Telugu News
mictv telugu

జనసేన కార్యకర్త ఇంటికి పవన్.. నేలపైనే నిద్ర

December 13, 2019

Janasena.

అందరితో పాటు సింపుల్‌గా కనిపించడం పవన్ మేనరిజం. సెలబ్రెటీ, పార్టీ అధినేత అయినా కూడా సాధారణ వ్యక్తుల్లాగే వ్యవహరిస్తారు. ఆయన ఇంటా.. బయట ఒకే విధంగా ఉంటారు. తాజాగా ఆయన మరోసారి సింప్లి సిటీని బయటపెట్టారు.కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష ముగిసిన తరవాత తన పార్టీ కార్యకర్త ఇంటికి వెళ్లారు. అక్కడ నేలపై పడుకొని విశ్రాంతి తీసుకున్నారు. ఇది చూసిన జనసైనికులు తెగ సంబరపడిపోతున్నారు.

దీక్ష తర్వాత పవన్ రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయానికి బయలుదేరారు. విమానం ఆలస్యంగా వస్తుందనే సమాచారంతో జనసేన కార్యకర్త ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్లి ఆయన ఇంటి వరండాలో  కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. తల కింద దిండు మాత్రమే పెట్టుకొని ఎటువంటి బెడ్‌షీట్ లేకుండా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన ఆయన అభిమానులు ఇదే తమ నాయకుడికి ఇతర నాయకులకు ఉన్న తేడా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.