జనసేన ప్రచార రథాలు రెడీ.. ఏకంగా ఎనిమిది.. - MicTv.in - Telugu News
mictv telugu

జనసేన ప్రచార రథాలు రెడీ.. ఏకంగా ఎనిమిది..

June 13, 2022

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వేగం పెంచారు. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన గెలుపే లక్ష్యంగా నాయకులతో, కార్యకర్తలతో కలిసి ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి, ప్రచారం చేయడానికి ఆయన ఎనిమిది బ్లాక్ స్కార్పియో వాహనాలను కొనుగోలు చేశారు. ఈ బ్లాక్ స్కార్పియో వాహనాలను పవన్ కల్యాణ్ కోనుగోలు చేయడంతో జనసేన కార్యకర్తలు, ఆయన అభిమానులు తెగ సంబరపడుతున్నారు. మరికొంతమంది షాక్ అవుతున్నారు.

ఈ క్రమంలో పలువురు ఈ కార్లకు ఎంత ధర ఉంటుంది? పవన్ కల్యాణ్ ఎంతపెట్టి కోనుగోలు చేశారు? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికల హడావుడి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీడీపీ నాయకులు ఎన్నికలకు అన్నీ ఏర్పాట్లు సిద్దం చేసుకుంటున్నారు. జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ సైతం అప్రమత్తం అయ్యి, ఎన్నికల ప్రచారం కోసం పవన్ కల్యాణ్ ఒకేసారి ఎనిమిది స్కార్పియో వాహనాలను కొన్నారు.

అయితే, ఈ కొత్త కార్ల కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా కోటిన్నర ఖర్చు చేశారట. ఒక కారు విలువ దాదాపు గా రూ.20 లక్షల రూపాయలు ఉంటుందట. ఇక, ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ తిరుపతి నుంచే ప్రారంభించాలని తలపెట్టరట. ఇప్పటికే పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆయన.. వాటిని 2023వ సంవత్సరం ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారట. పవన్ కల్యాణ్ ఎన్నికల కోసం తపిస్తున్న క్రమం చూస్తుంటే ఈసారి ఏపీలో తగ్గపోటే ఉన్నట్లు తెలుస్తోంది.