పవన్‌తో టీడీపీ నేతల భేటీ.. బాబు దీక్షకు జనసేన మద్దతు - MicTv.in - Telugu News
mictv telugu

పవన్‌తో టీడీపీ నేతల భేటీ.. బాబు దీక్షకు జనసేన మద్దతు

November 13, 2019

జనసేన అధినేత పవన్ కల్యాన్‌తో టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య భేటీ అయ్యారు. విజయవాడలోని పవన్ నివాసానికి వెళ్లి కలిసి చంద్రబాబు దీక్షకు మద్దతు కోరారు. దీనికి పవన్ కూడా సానుకూలంగా స్పందించినట్టు టీడీపీ నేతలు తెలిపారు. ఇసుక కొరతపై పోరాటానికి తమ మద్దతు ఉంటుందని పవన్ చెప్పినట్టు వెల్లడించారు. తమకు మద్దతు తెలిపిన పవన్ కల్యాన్‌కు టీడీపీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు.

Pawan Support.

పవన్‌తో భేటీ తర్వాత టీడీపీ నేతలు ఏపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందజేసిందని, ఆ విధానాన్నే జగన్ ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. తమ దీక్షకు మద్దతు ఇసుక వారోత్సవాలతో ప్రయోజనం ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు.  భవన నిర్మాణ కార్మికుల కోసం అన్ని పార్టీలతో కలిసి పోరాటం ఉధృతం చేస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. కాగా ఇసుక కొరతకు నిరసనగా గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు 12 గంటల పాటు ‘ఇసుక దీక్ష’ చేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తన దీక్ష కొనసాగించనున్నారు. ఇటీవల జనసేన లాంగ్ మార్చ్‌కు టీడీపీ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ దీక్షకు  కూడా ఆ పార్టీ మద్దతు ఇచ్చింది.