Pawankalyan In AP Political Crossroads
mictv telugu

పవన్ కల్యాణ్ చుట్టే రాజకీయాలు

November 17, 2022

ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు పవన్ చుట్టే పార్టీలు తిరుగుతున్నాయి. 2024 లో పవన్ కల్యాణ్‌ని ముందుంచి పాలిటిక్స్ నడిపే ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ నుంచి బయటకు రావాలని వామపక్షాలు కోరుతున్నాయి. పవన్ బీజేపీతోనే ఉంటారని సోమువీర్రాజు అంటున్నారు. మరి పవన్ కల్యాణ్ మాట, బాట ఏంటి?బీజేపీతోనే కలిసి నడుస్తారా?చంద్రబాబు అండ్ కోతో జత కడతారా?

పవన్ పాలిటిక్స్

తెలుగు తెరపై పవన్ కల్యాణ్ క్రేజీ స్టార్. టాలీవుడ్‌లో ఆయనది ప్రత్యేక చాఫ్టర్. ఇప్పుడు ఏపీ రాజకీయ తెరపై పవన్‌కు అదే క్రేజ్ కనిపిస్తుంది. పార్టీలు అన్ని పవన్ చుట్టూ తిరుగుతున్నాయి. 2024 ఎన్నికల్లో పవన్ ముందు పెట్టి నడిపించాలని బీజేపీ యోచిస్తోంది. మొన్న విశాఖలో మోదీని కలిసిన పవన్ ఏపీ రాజకీయాలపై చర్చించారు. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. పవన్ కల్యాణ్ తమతో కలిసి పోటీ చేస్తారని సోమువీర్రాజు తేల్చిచెప్పారు. చంద్రబాబుతో వెళ్లేది లేదని మోదీతో క్లారిటీగా చెప్పారని ఆయన అన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే పోటీచేస్తాయని సోమువీర్రాజు చెబుతున్నారు.

బీజేపీని వీడాలి…

మరోవైపు పవన్ కల్యాణ్ బీజేపీని వీడాలని ఏపీ సీపీఐ కోరుతోంది. చంద్రబాబు, వామపక్షాలతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. వైసీపీ సర్కార్ ని దించేందుకు విపక్షాలన్నీ కలిసి పోరాడాలంటున్నారు. దీనికోసం పవన్ కల్యాణ్ బీజేపీని వీడి తమతో కలువాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ నటిస్తున్నారని విమర్శించారు. ఆయన నటనకు ఇప్పటికైనా స్వస్తిపలికి తమతో కలువాలంటున్నారు.

అటు బాబు రెడీ

పవన్ కల్యాణ్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎదురుచూస్తున్నారు. ఎలాగైనా 2024 ఎన్నికలకు కలిసే వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే సీఎం అభ్యర్థిగా ప్రకటించైనా ముందుకెళ్లాలని భావిస్తున్నారట. వైసీపీ సర్కార్ ని దించేడమే లక్ష్యమన్నచంద్రబాబు..సీఎం పదవీని వదులుకోవడానికి సిద్ధమంటున్నారు. ఇటు బాబు దోస్తీ, అటు బీజేపీతో బంధంలో ఉన్న పవన్ కల్యాణ్ ఏం తేల్చుకోలేకపోతున్నారు.
పవన్ కల్యాణ్ , ఏపీ పాలిటిక్స్ , బీజేపీ, జనసేన , సీపీఐ