పవన్ ఈ విషయంలో రియల్ హీరోనే... - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ ఈ విషయంలో రియల్ హీరోనే…

July 30, 2017

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉద్దానం కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపేందుకు మంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని రోజులు ట్వీట్లకు, స్పీచ్ లకు పరిమితం అయిన పవన్ ఇప్పుడు ఆచరణలోకి దిగారు. హార్వర్డ్ ప్రొఫెసర్ల బృందం ఉద్దానం కిడ్నీ సమస్యలపై స్టడీ చేసింది. పవన్ కళ్యాణ్ వారితో వైజాగ్ లో భేటీ అయ్యారు. ఒక సీరియస్ ఇష్యూ తీసుకుని జనంలోకి వెళ్తున్నారు కళ్యాణ్ బాబు. ఎన్నో ఏళ్లుగా జనాలను పట్టి పీడిస్తున్న సమస్యను టేకప్ చేసి భేష్ అన్పించుకున్నారు. పవన్ లాంటి వాళ్లు సమస్యను టేకప్ చేస్తే దానికి వచ్చే రెస్పాన్స్ వేరుగా ఉంటుంది. ఇన్నాళ్లు ఉద్దానం జనాలు రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు. అన్నింటి కంటే కిడ్ని సమస్య చాలా పెద్దది.

పవన్ కళ్యాణ్ ఆదివారం వైజాగ్ వెళ్లి ఇష్యూను బాగా రైజ్ చేశారు. తాను రాజకీయాల కోసం ఈ పనిచేయడం లేదన్నారు. ఉద్దానం బాధితుల సమస్యకు పరిష్కారం కోసం అంతా కల్సి పనిచేద్దామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడూ భేటీ అవుతానని చెప్పారు. అవసరం అనుకుంటే వైసీపీ నేతని కల్సి సమస్య పరిష్కారానికి రావాల్సిందిగా కోరతానని అన్నారు.

పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు మాట్లాడిన మాటలు… ఇచ్చిన స్టేట్ మెంట్లు అన్నీ ఒక ఎత్తు అయితే ఉద్దానం సమస్య మాత్రం చాలా డిఫరెంట్. మంచి విషయం కూడా. ఉద్దానంలో కిడ్నీ వ్యాధికి కారణం తెలిస్తే ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లోవస్తున్న కిడ్నీ సమస్యలకు కూడా పరిష్కారం దొరుకినట్లే.

ఇంతకు ముందు ఎపికి ప్రత్యేక హోదా కోసం కళ్యాణ్ బాబు కొన్ని మీటింగు లు పెట్టారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టింగులూ పెట్టారు. ఆ తర్వాత దాన్ని వదిలేశారు. మరి ఉద్దానం సమస్యకు పరిష్కారం చూపేంత వరకు పనిచేస్తారా లేక ఎప్పటిలాగే ఇంతటితో ఆపేస్తారా చూడాలి. ఏదేమైనా ఉద్దానం విషయంలో పవన్ చొరవను మాత్రం మెచ్చుకోవాల్సిందే.