PawanKalyan Will Lead 2024 Elections With TDP and BJP..?
mictv telugu

ఒక్క ఛాన్స్ ప్లీజ్ వెనుక అర్థం ఇదేనా?

November 14, 2022

PawanKalyan Will Lead 2024 Elections With TDP and BJP..?

పవన్ కల్యాణ్ ఫుల్ క్లారిటీతో ఉన్నారా?2024 ఎన్నికలకు పక్కా స్కెచ్ వేశారా? ముందుండి వైసీపీ సర్కార్‌ని ఢీ కొట్టబోతున్నారా?సీఎం అభ్యర్థిగా సేనాని కదనరంగంలోకి దూకుతారా?బీజేపీ ఒప్పుకుంటుందేమోగానీ చంద్రబాబు మాటేమిటి?పవన్ కల్యాణ్ ఒక్క ఛాన్స్ ప్లీజ్ వెనుక అర్థం ఇదేనా? ఏపీలో పొలిటికల్ ఈక్వెషన్స్ మారుతున్నాయా?

సేనాని దూకుడు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. నిత్యం ఏదో ఓ పోరాటం పేరుతో జనం మధ్య ఉంటున్నారు. శ్రీకాకుళం ఉద్దానం నుంచి మొన్నటి ఇప్పటం దాకా ఇదే చేశారు.ఇక్కడ నుంచి సేనాని మరింత దూకుడు పెంచారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ జనంలోకి వెళ్తున్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి..ఏపీ రూపురేఖలు మార్చేస్తా, అవినీతి రహిత పాలన అందిస్తానంటూ మాట్లాడుతున్నారు. ఏ సభలోనైనా ఇదే మాట్లాడుతున్నారు. టార్గెట్ ఫిక్స్ మరి బాణాలు వదులుతున్నారు. రాసుకో బాబు అంటూ జగన్ సర్కార్ పై రగిలిపోతున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా సేనాని అడుగులు పడుతున్నాయి. జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ ముందుండి పోరాడుతానంటున్నారు. ఒక్క ఛాన్స్ ఫ్లీజ్ వ్యాఖ్యల వెనుక అర్థం ఇదే రీ సౌండ్ చేస్తోంది.

బీజేపీ ఓకే అంటుందా?

బీజేపీ,జనసేన మధ్య దోస్తీ కొనసాగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలదాకా కలిసే నడుస్తారు. రోడ్ మ్యాప్ ఇస్తామని బీజేపీ హైకమాండ్ చెప్పింది. ఈ రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్ననని పవన్ కల్యాణ్ పలుమార్లు చెప్పారు. మొన్న విశాఖలో ప్రధాని మోదీతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనూ ఏపీ భవిష్యత్ పైనే చర్చించానని పవన్ చెప్పారు. అంటే 2024లో బీజేపీతో కలిసి పక్కా ఎన్నికలకు వెళ్తున్నానని స్పష్టం చేశారు. మరి బీజేపీతో పాటు టీడీపీని కలుపుకుపోతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే బాబుతో పవన్‌కు మంచి స్నేహం ఉంది.స్నేహం 2024లో ఎన్నికల పొత్తుగా మారుతుందా?

పొత్తు పొడిచేనా?

ఏపీలో టీడీపీ, జనసేనకు అధికారికంగా ఇంకా పొత్తులేదు. కానీ చాలా కార్యక్రమాలు రెండుపార్టీలు కలిసిపనిచేశాయి. ఆలోచనలు ఒకేలా ఉంటాయి. వైసీపీ సర్కార్‌ని గద్దెదించడమే లక్ష్యం. పవన్ కల్యాణ్ చంద్రబాబు డైరెక్షన్‌లో నడుస్తున్నారని ఎప్పటినుంచో వైసీపీ ఆరోపిస్తోంది. అందుకు తగ్గట్టే పవన్ అడుగులు ఉన్నాయి. ఆ మధ్య చంద్రబాబు-పవన్ కల్యాణ్ సంయుక్త ప్రెస్ మీట్‌తో ఇదే స్పష్టమైంది.ఈ స్నేహం భవిష్యత్‌లో పొత్తుగా మారబోతుందా? బాబు రాకను బీజేపీ స్వాగతిస్తుందా?ఏపీలో విపక్షాలన్ని ఏకమవుతాయా?

బాబు ఓకే అంటారా?

గతంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైనా సరే..జగన్ సర్కార్‌ని మాత్రం సాగనంపాలని చంద్రబాబు అన్నారు. అంటే చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేశారా?పవన్ కల్యాణ్‌ను ముందు పెట్టి ఎలక్షన్ మిషన్‌ 2024ని నడిపించబోతున్నారా?కాపు ఓటు బ్యాంకే టార్గెట్ చేస్లూ పావులు కదుపుతున్నారా? కమ్మ ప్లస్ కాపు ఓట్ల సమీకరణాలతో ఏపీ రాజకీయాల ఈక్వేషన్స్ మార్చబోతున్నారా..? వపన్ కల్యాణ్ వ్యాఖ్యలను చూస్తే ఇదే అర్థం వస్తోంది.