Pawan's convoy collided and 10 people were injured
mictv telugu

పవన్ కడప పర్యటనలో ప్రమాదం.. పది మందికి గాయాలు

August 20, 2022

Pawan's convoy collided and 10 people were injured

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సాగు భారమై అప్పులు పెరిగిపోయి ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులను పరామర్శించి వారికి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. రైతు భరోసా పేరిట ఈ యాత్ర చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కడప జిల్లా సిద్ధవటంలో పర్యటించారు.

ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి కడపకు చేరుకున్న పవన్.. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా పయనించారు. అయితే కాసేపట్లో సిద్ధవటం చేరుకుంటారనగా ప్రమాదం చోటు చేసుకుంది. సిద్ధవటం మండలం మలినేనిపట్నం వద్ద పవన్ కాన్వాయ్‌లోని వాహనాలు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీకొట్టాయి. దీంతో పది మందికి గాయాలు కాగా, వారిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తర్వాత సిద్ధవటం చేరుకున్న పవన్ కల్యాణ్ అక్కడ రచ్చబండపై బాధిత కుటుంబాలతో మాట్లాడనున్నారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్ధిక సహాయం చేయనున్నారు. కాగా, ఇప్పటికే ఈ కార్యక్రమం కింద రెండు జిల్లాల్లో పర్యటించిన విషయం తెలిసిందే.