జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త విధానానికి తెరలేపారు. అధికారంలోకి రావాలంటే కాపు, బీసీ కాంబినేషన్ ఉండాల్సిందే అంటున్నారు. ఈ రెండు కలిస్తే రాజ్యాధికారం సాధ్యమని చెబుతున్నారు. ఎవర్నీ దేహీ అంటూ అడుక్కోవల్సిన అవసరమే ఉండదన్నారు పవన్ కల్యాణ్. మంగళగిరిలో జనసేనపారట్ీ బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేనాని. రాష్ట్రంలోని బీసీ కులాన్నింటిని కలిపితే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కే ఛాన్సే లేదన్నారు. ఇన్నాళ్లుగా బీసీల ఐఖ్యత ఎందుకు సాధ్యం కాలేదో అర్థం కాలేదన్న పవన్…గతంలో 93 ఉన్న బీసీ కులాలు ఇప్పుడు 140కి ఎందుకు పెరిగాయంటూ ప్రశ్నించారు. హక్కులు కాదు కావాల్సింది ముందు ఐక్యత సాధించాలంటూ సూచించారు. బీసీల కోసం దీక్షకు సిద్ధమన్న పవన్ కల్యాన్ అధికారంలోకి వస్తే వాళ్లకే 50శాతం పదవులు ఇస్తామంటూ హామీ ఇచ్చారు.