If you pay 20 rupees per year you can get 2 lakh profit
mictv telugu

ఏడాదికి 20 రూపాయలు చెల్లిస్తే,2లక్షల లాభం పొందవచ్చు,ఎలాగో తెలుసా..!

January 19, 2023

కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలను ద్రుష్టిలో పెట్టుకుని అనేక రకాల పథకాలను అందిస్తోంది. వీటిలో సామాజిక భద్రతకు సంబంధించిన పథకాలు కూడా ఉన్నాయి. వీటిలో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన గురించి మనం ఇప్పుడు చెప్పబోతున్నాం.

ఈ పథకంలో చేరడం ద్వారా మీరు 20 రూపాయలతో 2 లక్షల లాభం పొందవచ్చు. ఈ ప్రాజెక్టు వల్ల దేశంలోని పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. మీరు కనీసం 20 రూపాయల ప్రీమియం చెల్లిస్తే, మీకు 2 లక్షల వరకు బీమా కవరేజీ లభిస్తుంది. అయితే ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పొందడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు బ్యాంక్ ఖాతా ఉన్న బ్రాంచ్‌కు వెళ్లి ఫారమ్‌ను పూరించండి. లేదంటే బీమా ఏజెంట్ల ద్వారా కూడా ఈ పాలసీని తీసుకోవచ్చు.

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజనలో చేరిన వారికి సంవత్సరానికి 20 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్లాన్ మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడుతుంది. కాబట్టి బ్యాంకు ఖాతా నుంచి 20 రూపాయలు ఆటో మెటిగ్గా కట్‌ అవుతాయి. కాబట్టి బ్యాంకు ఖాతాలో ఎప్పుడు కొంతమొత్తం డబ్బులు ఉండేలా చూసుకోవాలి. ఈ మొత్తాన్ని మే 31వ తేదీన బ్యాంకు ఖాతా నుంచి తీసుకుంటుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది.

బ్యాంకు ఖాతాలో డబ్బులు లేకుంటే పాలసీ కూడా ఉంటుంది. అలాగే, బ్యాంకు ఖాతా మూసివేసినట్లయితే ఈ పాలసీ అందుబాటులో ఉండదు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజనకు ఒక బ్యాంకు ఖాతా మాత్రమే లింక్ చేసి ఉండాలి. ప్రీమియం చెల్లిస్తేనే పాలసీ పునరుద్ధరించబడుతుంది. లేదంటే పాలసీ రద్దు చేయబడుతుంది. 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న వారు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఇప్పుడు పాలసీ హోల్డర్లకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

పాలసీదారు ప్రమాదవశాత్తు మరణిస్తే, మొత్తం కుటుంబానికి 2 లక్షల బీమా ఉంటుంది. ప్రమాదం కారణంగా శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే లక్ష రూపాయలు అందజేస్తారు. ఇప్పుడే ఈ పథకంలో చేరండి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఈ పాలసీ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పిస్తుంది.