రాహుల్ గాంధీకి జరిమానా చెల్లించండి.. ఆరెస్సెస్‌ను ఆదేశించిన కోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

రాహుల్ గాంధీకి జరిమానా చెల్లించండి.. ఆరెస్సెస్‌ను ఆదేశించిన కోర్టు

April 22, 2022

11

కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీకి రూ. 1000 జరిమానా చెల్లించాలంటూ మహారాష్ట్ర భీవండి కోర్టు ఆర్ఎస్ఎస్ నేత రాజేశ్ కుంతేను ఆదేశించింది. వివరాలు.. 2014లో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ కారణమంటూ రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాజేశ్ కుంతే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను సమర్ధించుకోగా, 2018లో కోర్టు ఆయనపై అభియోగాలను మోపింది. అప్పటినుంచి కోర్టులో విచారణ జరుగుతుండగా, పిటిషన్ దారుడు, రాహుల్ గాంధీలు వరుసగా కోర్టు విచారణకు హాజరు కాలేదు. అనంతరం రాహుల్ గాంధీ వ్యాఖ్యలను నిరూపించేందుకు సమయం కావాలని పిటిషనర్ కోరగా, కోర్టు అందుకు అంగీకరించింది. అయినా కూడా రోజులు గడుస్తున్నా రాజేశ్ కుంతే కోర్టుకు హాజరు కాలేదు. ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు రాహుల్ గాంధీకి రూ. 500 జరిమానా చెల్లించాలని కుంతేను ఆదేశించింది. ఇంత చిన్న మొత్తాన్ని చెల్లించడంలో కూడా రాజేశ్ అలసత్వం ప్రదర్శించడంతో కోర్టు తాజాగా జరిమానాను రెట్టింపు చేసి రూ. 1000 జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.